ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.24 గంటల్లో రాష్ట్రంలో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1097కి చేరుకొన్నాయి.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.24 గంటల్లో రాష్ట్రంలో 81 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1097కి చేరుకొన్నాయి.
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 81 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1097 పాజిటివ్ కేసు లకు గాను 231 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 835. pic.twitter.com/WknwXZCQY2
undefined
గత 24 గంటల్లో ఏపీ రాష్ట్రంలో అత్యధికంగా కృష్ణా జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 52 కేసులు కొత్తగా నమోదైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.పశ్చిమగోదావరి జిల్లాలో 12, అనంతపురంలో 2, తూర్పుగోదావరిలో 2, గుంటూరులో 3, కడపలో 3,, కర్నూల్ లో 4, ప్రకాశంలో 3 కొత్తగా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో 835 కరోనా యాక్టివ్ కేసులున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ సోకినవారిలో ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జీ అయిన వారు 231గా ఏపీ సర్కార్ తేల్చింది.ఇక ఈ వైరస్ సోకి మరణించినవారి సంఖ్య 31గా ప్రభుత్వం తేల్చింది.
రాష్ట్రంలో 81 కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 80 కేసులు నమోదైన విషయం తెలిసిందే.