లైవ్ అప్ డేట్స్: స్థానిక పోరుపై నిమ్మగడ్డ భేటీ, ఎన్నికలకు సిద్దమన్న టీడీపీ

By narsimha lodeFirst Published Oct 28, 2020, 10:13 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తోంది.

 

గతంలో జరిగిన ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది.

ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ ఎస్ఈసీని కోరింది. గతంలో నిర్వహించిన మాదిరిగా కాకుండా ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ డిమాండ్ చేసింది.

ఎస్ఈసీ సమావేశానికి టీడీపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు. 

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎన్నికలను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. కొత్త జిల్లాలు ఏర్పడితే రిజర్వేషన్లు కూడ మారే అవకాశం ఉందని ఆ పార్టీ తెలిపింది.

గతంలో జరిగిన ఎన్నికలను రద్దు చేసి కొత్తగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని కాంగ్రెస్  పార్టీ డిమాండ్ చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గాను నోటిఫికేషన్ ఇవ్వాలని సీపీఐ డిమాండ్ చేసింది.

ఎస్ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి వైసీపీ దూరంగా ఉండడం సరైంది కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ చెప్పారు.


ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ఎన్నికలు నిర్వహించాలన్న సీపీఎం

ఎన్నికలను నిర్వహించాలని సీపీఎం కోరింది. ఈ మేరకు ఈ సమావేశానికి హాజరైన సీపీఎం ప్రతినిధి ఎన్నికలను కొనసాగించాలని కోరాడు.
 

అధికార దుర్వినియోగంతో గతంలో ఏకగ్రీవాలు జరిగాయని బీజేపీ, బీఎస్పీలు అభిప్రాయపడ్డాయి.

కొత్తగా ఎన్నికల నోటీఫికేషన్ ఇవ్వాలని బీజేపీ, బీఎస్పీలు ఎస్ఈసీని కోరాయి.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తోంది.  ఈ సమావేశానికి జనసేన దూరంగా ఉంది. అయితే తన అభిప్రాయాన్ని మెయిల్ ద్వారా పంపాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది. మరో వైపు వైసీపీ మాత్రం ఈ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఏపీ హైకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ సమావేశం నిర్వహిస్తున్నారు.

click me!