24 గంటల్లో 93 మంది మృతి: ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కరోనా కేసులు

Published : Aug 12, 2020, 06:23 PM IST
24 గంటల్లో 93 మంది మృతి: ఏపీలో రెండున్నర లక్షలు దాటిన కరోనా కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9597 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,54,146కి చేరుకొన్నాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 9597 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 2,54,146కి చేరుకొన్నాయి.

గత 24 గంటల్లో  అనంతపురంలో 781, చిత్తూరులో 1255, తూర్పు గోదావరిలో1332, గుంటూరులో 762, కడపలో 364, కృష్ణాలో335, కర్నూల్ లో781, నెల్లూరులో723, ప్రకాశంలో454,శ్రీకాకుళంలో511,విశాఖపట్టణంలో797,విజయనగరంలో593,పశ్చిమగోదావరిలో929 కేసులు నమోదయ్యాయి.

also read:తిరుమలలో కరోనా దెబ్బ: ఐదు జంటలకే మ్యారేజీ

గత 24 గంటల్లో కరోనాతో 93 మంది మరణించారు. గుంటూరులో 13, ప్రకాశంలో 11, చిత్తూరు, నెల్లూరులలో పదేసి చొప్పున మరణించారు. శ్రీకాకుళంలో 9 మంది, అనంతపురంలో ఏడుగురు, కడపలో ఏడుగురు, విశాఖ, తూర్పు గోదావరిలో ఆరుగురి చొప్పున, కర్నూల్, పశ్చిమ గోదావరిలలో నలుగురి చొప్పున, కృష్ణాలో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 2296 మంది చనిపోయారు. 

ఏపీలో జిల్లాల వారీగా నమోదైన మొత్తం కేసులు, మరణాలు

అనంతపురం - 26,478, మరణాలు 195
చిత్తూరు-  19,569, మరణాలు 199
తూర్పుగోదావరి - 35,642, మరణాలలు 238
గుంటూరు - 23,818. మరణాలు 255
కడప- 14,819, మరణాలు 91
కృష్ణా - 11,115 మరణాలు 217
నెల్లూరు- 14,818, మరణాలు 115
కర్నూల్ - 30,233 మరణాలు 258
ప్రకాశం - 9762, మరణాలు 140
శ్రీకాకుళం- 12,348, మరణాలు 144
విశాఖపట్టణం - 21586, మరణాలు 181
విజయనగరం - 10,567, మరణాలు 4501
పశ్చిమగోదావరి - 20,476, మరణాలు 165

 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్