ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 8,601 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 3,58,817కి కరోనా కేసులు చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కరోనా కేసులు 8,601 నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో 3,58,817కి కరోనా కేసులు చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో అనంతపురంలో 933, చిత్తూరులో 495, తూర్పుగోదావరిలో 1441, గుంటూరులో 467, కడపలో 639, కృష్ణాలో 154, కర్నూల్ లో 484, నెల్లూరులో 965, ప్రకాశంలో 589, శ్రీకాకుళంలో485, విశాఖపట్టణంలో 911, విజయనగరంలో572, పశ్చిమగోదావరిలో 466 కేసులు నమోదయ్యాయి.
undefined
రాష్ట్రంలో కరోనాతో గత 24 గంటల్లో 86 మంది చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో 3,368 మంది మరణించారు.
కరోనాతో గత 24 గంటల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పది మంది చొప్పున మరణించారు. తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మరణించారు. చిత్తూరు, కడప జిల్లాల్లో 8 మంది చొప్పున చనిపోయారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో ఏడుగురి చొప్పున మరణించారు. అనంతపురంలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, విజయనగరంలో నలుగురు, కర్నూల్ లో ఇద్దరు., పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 32,92,501 మంది శాంపిల్స్ ను పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,68,828 మంది కరోనా నుండి కోలుకొన్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కరోనా కేసులు, మరణాలు
అనంతపురం-35,726 , మరణాలు 282
చిత్తూరు - 30,325, మరణాలు 336
తూర్పుగోదావరి -50,686, మరణాలు 335
గుంటూరు -30,859, మరణాలు 340
కడప -21,162, మరణాలు 167
కృష్ణా -14,029, మరణాలు 251
కర్నూల్- 39,319, మరణాలు 337
నెల్లూరు -23,326, మరణాలు 227
ప్రకాశం - 17,170, మరణాలు 233
శ్రీకాకుళం-18,934, మరణాలు 210
విశాఖపట్టణం -30,715, మరణాలు 251
విజయనగరం -16,240, మరణాలు 143
పశ్చిమగోదావరి -30,326, మరణాలు 256
: 24/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 3,58,817 పాజిటివ్ కేసు లకు గాను
*2,65,933 మంది డిశ్చార్జ్ కాగా
*3,368 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 89,516 pic.twitter.com/e6LRVOjn4P