వైసీపి నేత హత్య కేసు టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్

Published : Aug 24, 2020, 04:19 PM ISTUpdated : Aug 26, 2020, 12:38 PM IST
వైసీపి నేత హత్య కేసు టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్

సారాంశం

మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.

విజయవాడ: మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు జిల్లా కోర్టు సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.

వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఏడాది జూన్ 29వ తేదీన వైసీపీ నేత భాస్కర్ రావును మచిలీపట్నం మార్కెట్ యార్డు వద్ద హత్య చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు  ఈ ఏడాది జూలై 4వ తేదీన అరెస్ట్ చేశారు. 

ఈ కేసులో జైలులో ఉన్న కొల్లు రవీంద్ర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  జిల్లా కోర్టులో ఇవాళ విచారణ జరిగింది.  కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేస్తూ జిల్లా జడ్జి వై. లక్ష్మణరావు ఇవాళ ఆదేశించారు. 14 షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.  అంతేకాదు లక్ష రూపాయాల పూచీకత్తును కూడ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 

కొల్లు రవీంద్రను ఈ కేసులో ఉద్దేశ్యపూర్వకంగా ఇరికించారని అప్పట్లో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేతలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని ఆయన ఆరోపణలు చేశారు.

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?