ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. గత 24 గంటల్లో 8,096 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల 09 వేల 558కి చేరుకొంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు. గత 24 గంటల్లో 8,096 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6 లక్షల 09 వేల 558కి చేరుకొంది.
కరోనాతో గత 24 గంటల్లో 67 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో 5,244 మంది మరణించారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 84,423 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకిన వారిలో 5,19,891 మంది కోలుకొన్నారని ప్రభుత్వం ప్రకటించింది.
undefined
రాష్ట్రంలో ఇప్పటివరకు 49,59,081 మంది శాంపిల్స్ పరీక్షించారు. గత 24 గంటల్లో కడపలో ఎనిమిదిమంది, చిత్తూరు ఏడుగురు, తూర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్టణంలలో ఆరుగురి చొప్పున మరణించారు. అనంతపురం, శ్రీకాకుళంలలో ఐదుగురి చొప్పున చనిపోయారు. పశ్చిమగోదావరిలో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు కరోనాతో మరణించారు.
గత 24 గంటల్లో అనంతపురంలో 423, చిత్తూరులో 902, తూర్పుగోదావరిలో 1405, గుంటూరులో 513, కడపలో 419, కృష్ణాలో 487, కర్నూల్ లో 337, నెల్లూరులో 468, ప్రకాశంలో 713, శ్రీకాకుళంలో 496, విశాఖపట్టణంలో 371, విజయనగరంలో 487 పశ్చిమగోదావరిలో 1035 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -51,821, మరణాలు 434
చిత్తూరు -53,323 మరణాలు 571
తూర్పుగోదావరి -83,852 మరణాలు 478
గుంటూరు -48,393 మరణాలు 487
కడప -38,744 మరణాలు 335
కృష్ణా -23,123, మరణాలు 374
కర్నూల్ -53,435, మరణాలు 437
నెల్లూరు -46,590 మరణాలు 416
ప్రకాశం -40,156 మరణాలు 408
శ్రీకాకుళం -34,983మరణాలు 305
విశాఖపట్టణం -46,057 మరణాలు 380
విజయనగరం -55,670, మరణాలు 409
పశ్చిమగోదావరి -53,571, మరణాలు 401
: 18/09/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 6,06,663 పాజిటివ్ కేసు లకు గాను
*5,16,996 మంది డిశ్చార్జ్ కాగా
*5,244 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 84,423 pic.twitter.com/Usw2XVVMOv