భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,76,336 చేరిక

Published : Dec 15, 2020, 05:59 PM IST
భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: ఏపీలో మొత్తం 8,76,336 చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 76వేల 336 కి చేరుకొన్నాయి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 76వేల 336 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 05 మంది కరోనా మరణించారు.కరోనాతో  కృష్ణాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, నెల్లూరులలో ఒక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,064కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,09,37,377 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 61,452 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 0500 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 64వేల 612 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 4,660 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.


గత 24 గంటల్లో 
అనంతపురంలో 019,చిత్తూరులో 088,తూర్పుగోదావరిలో 047, గుంటూరులో 055, కడపలో 034, కృష్ణాలో 077, కర్నూల్ లో 009, నెల్లూరులో 022, ప్రకాశంలో 026, శ్రీకాకుళంలో 021, విశాఖపట్టణంలో 020, విజయనగరంలో 019పశ్చిమగోదావరిలో 063 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,033, మరణాలు 594
చిత్తూరు  -84,977,మరణాలు 836
తూర్పుగోదావరి -1,23,063, మరణాలు 636
గుంటూరు  -74,023, మరణాలు 658
కడప  -54,687, మరణాలు 454
కృష్ణా  -46,798,మరణాలు 656
కర్నూల్  -60,425, మరణాలు 487
నెల్లూరు -61,831, మరణాలు 504
ప్రకాశం -61,830, మరణాలు 578
శ్రీకాకుళం -45,744, మరణాలు 346
విశాఖపట్టణం  -58,675, మరణాలు 547
విజయనగరం  -40,895, మరణాలు 238
పశ్చిమగోదావరి -93,460, మరణాలు 530

 


 

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy Comments on BR Naidu: బీఆర్ నాయుడుపై భూమన సెటైర్లు| Asianet News Telugu
Pawan Kalyan Visits Kakinada GGH Firecracker Blast Victims | Asianet News Telugu