ఢిల్లీకి బయలుదేరిన ఏపీ సీఎం జగన్: నేడు అమిత్ షా తో భేటీ

By narsimha lodeFirst Published Dec 15, 2020, 3:11 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు.
 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టు నుండి సీఎం జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన రావాల్సిన నిధుల విషయమై కేంద్ర మంత్రులతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది.

ఇవాళ సాయంత్రం 5 గంటలకు జగన్ ఢిల్లీకి చేరుకొంటారు. పోలవరం అంశంపై సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. పోలవరం సవరించిన డీపీఆర్ ను జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆమోదించింది. ఈ డీపీఆర్ ను ఆర్ధిక శాఖ ఆమోదించాల్సి ఉంది.ఈ విషయమై హోంమంత్రి అమిత్ షాతో జగన్ చర్చించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి.

ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ను కూడా ఆయన కోరారు.  అపాయింట్ మెంట్ లభిస్తే ఈ నెల 16వ తేదీన జగన్ మోడీని కూడా కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి నిధుల విషయాన్ని కూడ కేంద్ర మంత్రులతో ఆయన చర్చించే అవకాశం ఉంది.
 

click me!