ఒక్క రోజులోనే అత్యధికం: ఏపీలో 8,929కి చేరిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published Jun 21, 2020, 1:06 PM IST
Highlights

ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 477 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల  8,929 సంఖ్య  చేరుకొన్నాయి.


అమరావతి: ఏపీ రాష్ట్రంలో 24 గంటల్లో 477 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల  8,929 సంఖ్య  చేరుకొన్నాయి.

24 గంటల్లో ఏపీకి చెందిన వారిలో 439 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారిలో 34 మందికి  కోవిడ్ నిర్ధారణ అయింది.విదేశాల నుండి వచ్చినవారిలో 330 మందికి కరోనా సోకింది. వీరిలో 278 యాక్టివ్ కేసులు. 52 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. 

 

: 21/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7059 పాజిటివ్ కేసు లకు గాను
*3354 మంది డిశ్చార్జ్ కాగా
*106 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3599 pic.twitter.com/lRJWN83XGy

— ArogyaAndhra (@ArogyaAndhra)

ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 106 మంది మరణించారు. రాష్ట్రంలో 3354 మందికి కరోనా నుండి కోలుకొన్నారు.  ప్రస్తుతం ఆసుపత్రుల్లో 3599 మంది చికిత్స పొందుతున్నారు. 

గత 24 గంటల్లో 24451 మంది శాంపిల్స్ పరీక్షిస్తే  477 మందికి కరోనా సోకినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 1294 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. కృష్ణాలో 1048 మందికి కరోనా సోకింది.
 

click me!