కృష్ణా జిల్లాలో జర్నలిస్టు హత్య, వాట్సాప్ పోస్టు కారణమా...?

By Sreeharsha GopaganiFirst Published Jun 21, 2020, 10:03 AM IST
Highlights

నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ కి విలేకరి గా పనిచేస్తున్నాడు. గత నాలుగు రోజులుగా అతడు కనిపించకపోవడంతో అతని తల్లి నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

కృష్ణ జిల్లా పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒక జర్నలిస్టును అతికిరాతకంగా చంపి పాతిపెట్టిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. హత్యా విషయం తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలంతా అవాక్కయ్యారు. 

వివరాల్లోకి వెళితే... నందిగామ మండలం మునగచర్ల గ్రామానికి చెందిన గంటా నవీన్ అనే వ్యక్తి ఒక యూట్యూబ్ ఛానల్ కి విలేకరి గా పనిచేస్తున్నాడు. గత నాలుగు రోజులుగా అతడు కనిపించకపోవడంతో అతని తల్లి నందిగామ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

నేటి ఉదయం పట్టణంలోని కాకతీయ స్కూల్ రోడ్డులో ఒక శవం తాలూకూ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ శవం నవీన్ ధీ గా గుర్తించారు. 

అతడిని హత్యా చేసి గుంటతీసి పాతిపెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పాతి పెట్టారు. అతడి పైన గతంలో అనేక కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ కూడా ఉంది. 

ఈ నేపథ్యంలో పాత కక్షలతో ఎవరైనా హత్య చేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు పోలీసులు.  ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోని మెసేజిలను కూడా పరిశీలిస్తున్నారు. ఎవరిని ఉద్దేశిస్తూ నవీన్ ఆ పోస్టులను పెట్టాడు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

click me!