ఏపీలో 12వేలకు చేరువలో కరోనా మరణాలు: తగ్గిన కోవిడ్ కేసులు

Published : Jun 14, 2021, 06:49 PM IST
ఏపీలో 12వేలకు చేరువలో కరోనా మరణాలు: తగ్గిన కోవిడ్ కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 4,549 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 18లక్షల 14 వేల 393కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 59 మంది మరణించారు. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 4,549 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 18లక్షల 14 వేల 393కి చేరుకొన్నాయి.కరోనాతో ఒక్క రోజులోనే 59 మంది మరణించారు. గత 24 గంటల్లో అనంతపురంలో 272 చిత్తూరులో 860, తూర్పుగోదావరిలో619, గుంటూరులో322, కడపలో412, కృష్ణాలో210, కర్నూల్ లో198, నెల్లూరులో 182, ప్రకాశంలో 207,విశాఖపట్టణంలో 263, శ్రీకాకుళంలో228, విజయనగరంలో 247, పశ్చిమగోదావరిలో 529 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో59  మంది మరణించారు. చిత్తూరులో 12 మంది,ప్రకాశంలో 9 మంది, పశ్చిమగోదావరిలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీకాళం జిల్లాల్లో నలుగురు చొప్పున మరణించారు. గుంటూరు, కర్నూల్, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. కడప, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరి చొప్పున ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రంలో 11,999మంది చనిపోయారు. 

గత 24 గంటల్లో 87,756  మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 4,549 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. గత 24 గంటల్లో కరోనా నుండి 10,114 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుండి  17,22,381 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు2,05,38,738 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. ఇప్పటికి రాష్ట్రంలో 18,14,393 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,013 యాక్టివ్ కేసులున్నాయి. 

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,49,866, మరణాలు 1006
చిత్తూరు-2,08,978, మరణాలు1466
తూర్పుగోదావరి-2,48,466, మరణాలు 1053
గుంటూరు -1,57,563,మరణాలు 1018
కడప -1,02,027 మరణాలు 581
కృష్ణా -95,853 ,మరణాలు 1037
కర్నూల్ - 1,19,703,మరణాలు 791
నెల్లూరు -1,23,512,మరణాలు 876
ప్రకాశం -1,15,285 మరణాలు 869
శ్రీకాకుళం-1,14,697, మరణాలు 670
విశాఖపట్టణం -1,45,286, మరణాలు 1016
విజయనగరం -78,075, మరణాలు 634
పశ్చిమగోదావరి-1,52,187, మరణాలు 982


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu