ఏపీ సీఎం జగన్ దంపతులు సోమవారం నాడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యారు.
అమరావతి:ఏపీ సీఎం జగన్ దంపతులు సోమవారం నాడు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ తో భేటీ అయ్యారు. గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల నియామకం కోసం ప్రభుత్వం నాలుగు పేర్లను గవర్నర్ కు సిఫారసు చేసింది. అయితే ఇద్దరి పేర్లపై గవర్నర్ అభ్యంతరం చెబుతున్నారని సమాచారం. ఇద్దరిపై కేసులున్న నేపథ్యంలో గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. నలుగురు ఎమ్మెల్సీ పేర్లపై కూడ జగన్ చర్చించే అవకాశం ఉంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ గత వారంలో ఢిల్లీలో పర్యటించారు. ఢిల్లీ పర్యటన తర్వాత గవర్నర్ తో భేటీ కావడం ప్రాధాన్యత నెలకొంది. కరోనా కారణంగా సీఎం జగన్ గవర్నర్ ను కలవలేదు.
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియతో పాటు కరోనా పరిస్థితులపై జగన్ గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది. గత ఏడాదిలో దీపావళి సమయంలో గవర్నర్ దంపతులతో ఏపీ సీఎం వైఎస్ జగన్ దంపతులు భేటీ అయ్యారు.