ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,620 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 96 వేల 919కి చేరుకొన్నాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 3,620 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షల 96 వేల 919కి చేరుకొన్నాయి.
గత 24 గంటల్లో 12 మంది కరోనా మరణించారు.కరోనాతో గుంటూరులో నలుగురు చనిపోయారు.చిత్తూరు, తూర్పుగోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు.అనంతపురం, కడప, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.దీంతోరాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,524కి చేరుకొంది.
undefined
రాష్ట్రంలో ఇప్పటివరకు 73 లక్షల 47వేల 776 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 76,726మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 3,620 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల58 వేల 138 మంది కరోనా నుండి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 32,257యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
గత 24 గంటల్లో అనంతపురంలో 196,చిత్తూరులో 412 తూర్పుగోదావరిలో 492, గుంటూరులో 385, కడపలో 212 కృష్ణాలో 370, కర్నూల్ లో 66 నెల్లూరులో 126,ప్రకాశంలో 311, శ్రీకాకుళంలో 126, విశాఖపట్టణంలో 171, విజయనగరంలో 122,పశ్చిమగోదావరిలో 631కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం -63,307, మరణాలు 543
చిత్తూరు -75,343,మరణాలు 754
తూర్పుగోదావరి -1,12,186 మరణాలు 595
గుంటూరు -63,849 మరణాలు 598
కడప -50,586 మరణాలు 421
కృష్ణా -35,986 మరణాలు 539
కర్నూల్ -59,027 మరణాలు 480
నెల్లూరు -58,668 మరణాలు 483
ప్రకాశం -57,636 మరణాలు 565
శ్రీకాకుళం -43,136 మరణాలు 338
విశాఖపట్టణం -54,475 మరణాలు 496
విజయనగరం -38,573 మరణాలు 226
పశ్చిమగోదావరి -81,252 మరణాలు 486
: 22/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7,94,024 పాజిటివ్ కేసు లకు గాను
*7,55,243 మంది డిశ్చార్జ్ కాగా
*6,524 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 32,257 pic.twitter.com/GUwNXX6a77