ఆయన్ను మిగతా రాష్ట్రాలు ఫాలో అవ్వాలి: జగన్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు

Siva Kodati |  
Published : Oct 22, 2020, 04:11 PM IST
ఆయన్ను మిగతా రాష్ట్రాలు ఫాలో అవ్వాలి: జగన్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ ప్రశంసల వర్షం కురిపించారు. గురువారం వెబినార్ ద్వారా జరిగిన ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలను వివరించారు.

ఈ సందర్భంగా పోక్రియాల్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఇది ప్రజలకు మేలు చేస్తోందని.. అలాగే విద్యార్థుల కోసం సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని కొనియాడారు.

ముఖ్యంగా విద్యామృతం, విద్యా కళశం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించటంపై రమేశ్ ప్రశంసలు కురిపించారు. విద్యార్థులకు మంచి పోషకాహారాన్ని అందిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్‌ని కేటాయించి ఇవ్వడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు.

జగన్‌ను ఇతర రాష్ట్రాలు అనుసరిస్తే బాగుంటుందని .. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేస్తామని రమేశ్ పోక్రియాల్ స్పష్టం చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!