24 గంటల్లో 2901 కేసులు: ఏపీలో 8,17,679కి చేరిన కరోనా కేసులు

By narsimha lodeFirst Published Oct 29, 2020, 6:21 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2905 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 17 వేల 679 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 2905 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 17 వేల 679 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 16 మంది కరోనా మరణించారు.కరోనాతో కృష్ణాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, కడప జిల్లాలో ఇద్దరి చొప్పున మరణించారు. గుంటూరు, నెల్లూరు, విశాఖపట్టణం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 6,659 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 78లక్షల 62వేల 459 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 88,778 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 2905 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

ఏపీలో ఇప్పటివరకు 7 లక్షల 84 వేల 752 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 26,268 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 221,చిత్తూరులో 259 తూర్పుగోదావరిలో 414, గుంటూరులో 359, కడపలో191 కృష్ణాలో 361, కర్నూల్ లో 025 నెల్లూరులో 096,ప్రకాశంలో 206, శ్రీకాకుళంలో 090, విశాఖపట్టణంలో 119, విజయనగరంలో 070,పశ్చిమగోదావరిలో 494కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -64,285, మరణాలు 557
చిత్తూరు  -77,695,మరణాలు 776
తూర్పుగోదావరి -1,14,968 మరణాలు 609
గుంటూరు  -66,511 మరణాలు 614
కడప  -51,763 మరణాలు 437
కృష్ణా  -38,451 మరణాలు 560
కర్నూల్  -59,398 మరణాలు 482
నెల్లూరు -59,330 మరణాలు 570
ప్రకాశం -59,121 మరణాలు 570
శ్రీకాకుళం -43,788 మరణాలు 339
విశాఖపట్టణం  -55,548 మరణాలు 505
విజయనగరం  -38,161 మరణాలు 229
పశ్చిమగోదావరి -84,765 మరణాలు 495

 

: 29/10/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,14,784 పాజిటివ్ కేసు లకు గాను
*7,81,857 మంది డిశ్చార్జ్ కాగా
*6,659 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 26,268 pic.twitter.com/Lo67nZ3u2i

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!