ఏపీలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు: 24 గంటల్లో 3 వేలలోపు కేసులు

Published : Jun 21, 2021, 06:18 PM IST
ఏపీలో  తగ్గిన కరోనా కేసులు, మరణాలు: 24 గంటల్లో 3 వేలలోపు కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,363 కు చేరింది. 

అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,363 కు చేరింది. 

గడిచిన 24 గంటల్లో 7,504 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 17 లక్షల 82 వేల 680 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 58,140 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,12,05,849 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో 128చిత్తూరులో 531, తూర్పుగోదావరిలో335, గుంటూరులో158 కడపలో162, కృష్ణాలో213, కర్నూల్ లో162, నెల్లూరులో 201, ప్రకాశంలో 127,విశాఖపట్టణంలో 160, శ్రీకాకుళంలో144, విజయనగరంలో 88, పశ్చిమగోదావరిలో 211 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో44  మంది మరణించారు. చిత్తూరులో 10మంది, అనంతపురం, కర్నూల్, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురి చొప్పున చనిపోయారు. కృష్ణాలో ఇద్దరు,  కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కరి చొప్పున కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో  12,363మంది చనిపోయారు. 


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,52,161 మరణాలు 1030
చిత్తూరు-2,14,719, మరణాలు1541
తూర్పుగోదావరి-2,55,686, మరణాలు 1089
గుంటూరు -1,59,820,మరణాలు 1060
కడప -1,04,444 మరణాలు 596
కృష్ణా -98,697,మరణాలు 1065
కర్నూల్ - 1,20,981,మరణాలు 807
నెల్లూరు -1,25,360,మరణాలు 889
ప్రకాశం -1,18,246 మరణాలు 895
శ్రీకాకుళం-1,16,951 మరణాలు 699
విశాఖపట్టణం -1,47,015, మరణాలు 1038
విజయనగరం -79,321, మరణాలు 645
పశ్చిమగోదావరి-1,56,887, మరణాలు 1009

 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్