ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కొన్ని జిల్లాల్లో తగ్గుముఖం పట్టినా మరికొన్ని జిల్లాల్లో ఈ వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 1520 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 20,18,200 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్క రోజే కరోనాతో 10 మంది మృత్యువాత పడ్డారు.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో64,739మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1520 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,18,200 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,887 కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 1290 మంది కోవిడ్ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 89వేల 391 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,922 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,68,09,774 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
గత 24 గంటల్లో అనంతపురంలో024,చిత్తూరులో 188, తూర్పుగోదావరిలో263,గుంటూరులో162,కడపలో 099, కృష్ణాలో159, కర్నూల్ లో006, నెల్లూరులో186, ప్రకాశంలో 123,విశాఖపట్టణంలో 090,శ్రీకాకుళంలో037, విజయనగరంలో 012,పశ్చిమగోదావరిలో 171కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో కరోనాతో 10 మంది చనిపోయారు.కృష్ణా జిల్లాలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,887కి చేరుకొంది.
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు
అనంతపురం-1,57,212, మరణాలు 1091
చిత్తూరు-2,38,9745, మరణాలు1853
తూర్పుగోదావరి-2,86,344, మరణాలు 1260
గుంటూరు -1,72,677,మరణాలు 1183
కడప -1,12,865, మరణాలు 631
కృష్ణా -1,14,196,మరణాలు 1323
కర్నూల్ - 1,23,818,మరణాలు 849
నెల్లూరు -1,40,658,మరణాలు 1009
ప్రకాశం -1,34,028, మరణాలు 1052
శ్రీకాకుళం-1,22,147, మరణాలు 779
విశాఖపట్టణం -1,55,169, మరణాలు 1106
విజయనగరం -82,461, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,74,785, మరణాలు 1082
: 03/09/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,15,305 పాజిటివ్ కేసు లకు గాను
*19,86,496 మంది డిశ్చార్జ్ కాగా
*13,887 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,922 pic.twitter.com/G0NlYg9UiJ