కృష్ణా నదిలో చిక్కుకున్న 132 లారీలు: క్రేన్ల సహాయంతో బయటకు

By narsimha lodeFirst Published Aug 15, 2021, 4:45 PM IST
Highlights

కృష్ణా నదిలో చిక్కుకొన్న 132 లారీలను ఆదివారం నడు బయటకు తీశారు. ఇసుక కోసం వచ్చిన లారీలను  అధికారులు క్రేన్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు మూసివేయడంతో వరద ప్రభావం కూడ నిలిచిపోవడంతో వాహనాలను క్రేన్ల సహయంతో  బయటకు లాగారు.

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో చిక్కుకొనిపోయిన లారీలను ఆదివారం నాడు అధికారులు బయటకు తీసుకొచ్చారు.కృష్ణా నదిలో ఒక్కసారిగా ఇసుక కోసం 132 లారీలు వచ్చాయి.  నదికి వరద పెరిగిపోవడంతో నదిలోనే లారీలు నిలిచిపోయాయి.  వరద కారణంగా వాహనాలు వెనక్కి వచ్చే ప,రిస్థితి లేకుండా పోయింది. 

 దీంతో పులిచింతల ప్రాజెక్టు గేట్లనుతత మూసివేశారు. దీంతో నీటి విడుదల నిలిచిపోయింది.   నీటి ప్రవాహం తగ్గిపోయిన తర్వాత క్రేన్ల సహాయంతో నీటిలో చిక్కుకొన్న 132 లారీలు, 4 ట్రాక్టర్లను బయటకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

also read:కృష్ణా నదిలో లారీలు.. పులిచింతల గేట్లు మూసివేత, కొనసాగుతున్న సహాయక చర్యలు

శనివారం నాడు ఇసుక కోసం చెవిటికల్లు వద్ద ఉన్న ఇసుక ర్యాంప్  నుండి ఇసుకను లోడ్ చేసే సమయంలో కృష్ణా నదికి ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. దీంతో వాహనాలన్నీ నీటిలోనే నిలిచిపోయాయి.విషయం తెలిసిన వెంటనే రెవిప్యూ, ఫైర్ సిబ్బంది, పోలీసులు చెవిటికల్లు గ్రామానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 24 గంటల తర్వాత  లారీలను బయటకు తీశారు. 

 

 

click me!