తూ.గోదావరిలో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 19,98,603కి చేరిక

By narsimha lodeFirst Published Aug 19, 2021, 5:18 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1501 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.  రాష్ట్రంలో మొత్తం కేసులు 19,98,603కి చేరుకొన్నాయి.


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో67,716 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1501 మందికి కరోనా నిర్ధారణ అయింది. 

దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,98,603 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 10మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,696కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1697మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 69వేల 169 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 15,738 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,59,03,356 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో021,చిత్తూరులో 174, తూర్పుగోదావరిలో315,గుంటూరులో141,కడపలో 049, కృష్ణాలో147, కర్నూల్ లో010, నెల్లూరులో242, ప్రకాశంలో 107,విశాఖపట్టణంలో 109,శ్రీకాకుళంలో030, విజయనగరంలో 006,పశ్చిమగోదావరిలో 150 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  10మంది చనిపోయారు. కృష్ణా జిల్లాలో ముగ్గురు,చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున కరోనాతో చనిపోయారు. విశాఖపట్టణంలో ఒక్కరు మరణించారు.దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,696కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,56,859, మరణాలు 1091
చిత్తూరు-2,35,784 మరణాలు1810
తూర్పుగోదావరి-2,83,454, మరణాలు 1246
గుంటూరు -1,71,119,మరణాలు 1172
కడప -1,11,820, మరణాలు 629
కృష్ణా -1,12,132,మరణాలు 1272
కర్నూల్ - 1,23,638,మరణాలు 844
నెల్లూరు -1,38,346,మరణాలు 986
ప్రకాశం -1,32,284, మరణాలు 1029
శ్రీకాకుళం-1,21,562, మరణాలు 773
విశాఖపట్టణం -1,54,074, మరణాలు 1099
విజయనగరం -81,945, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,72,691, మరణాలు 1076
 

: 19/08/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,95,708 పాజిటివ్ కేసు లకు గాను
*19,66,274 మంది డిశ్చార్జ్ కాగా
*13,696 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 15,738 pic.twitter.com/gjgyRzJEvc

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!