24 గంటల్లో కరోనాతో 92 మంది మృతి: ఏపీలో 4 లక్షలకు చేరువలో కేసులు

Published : Aug 27, 2020, 05:28 PM ISTUpdated : Aug 27, 2020, 06:15 PM IST
24 గంటల్లో కరోనాతో  92 మంది మృతి: ఏపీలో 4 లక్షలకు చేరువలో కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,621 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరుకొన్నాయి.  


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 10,621 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,93,090కి చేరుకొన్నాయి.  

గత 24 గంటల్లో అనంతపురంలో815, చిత్తూరులో928, తూర్పుగోదావరిలో1089, గుంటూరులో 926, కడపలో 844, కృష్ణాలో316, కర్నూల్  లో855, నెల్లూరులో 934, ప్రకాశంలో 1020, శ్రీకాకుళంలో 846, విశాఖపట్టణంలో593, విజయనగరంలో 563, పశ్చిమగోదావరిలో892 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో 92 మంది మరణించారు. కర్నూల్‌లో 13 మంది, నెల్లూరులో 11 మంది, తూర్పు గోదావరిలో 10 మంది, చిత్తూరులో 9 మంది, కడప, పశ్చిమగోదావరిలో ఏడుగురి చొప్పున మరణించారు. అనంతపురం, ప్రకాశం, విశాఖపట్టణంలలో ఆరుగురి చొప్పున మరణించారు. గుంటూరులో ఐదుగురు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరంలలో నలుగురి చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 3633 మంది చనిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.


రాష్ట్రంలో ఇప్పటివరకు 34,79,990 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. గత 24 గంటల్లో 61,300 శాంపిల్స్ సేకరిస్తే 10,621 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,92,353 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 3,633 మంది మరణించారు.గత 24 గంటల్లో 8,528 మంది కరోనా నుండి కోలుకొన్నారు. ప్రస్తుతం 94,209 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

రాష్ట్రంలో వివిద జిల్లాల్లో కరోనా కేసులు, మరణాలు


అనంతపురం -37,763, మరణాలు 305
చిత్తూరు -33,133, మరణాలు 369
తూర్పుగోదావరి -54,656, మరణాలు 364
గుంటూరు -33,234, మరణాలు 355
కడప -23,255, మరణాలు 192
కృష్ణా -14,966, మరణాలు 264
కర్నూల్ -41,700, మరణాలు 355
నెల్లూరు -26,377, మరణాలు 249
ప్రకాశం -19,681, మరణాలు 258
శ్రీకాకుళం-20,950, మరణాలు 224
విశాఖపట్టణం -33,310 మరణాలు 268
విజయనగరం -18,034, మరణాలు 153
పశ్చిమగోదావరి -33,136, మరణాలు 277

 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!