కరోనా దెబ్బ: పిఠాపురంలో పెళ్లిని నిలిపివేసిన అధికారులు

By narsimha lodeFirst Published Mar 23, 2020, 10:28 AM IST
Highlights

కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం నాడు జరగాల్సిన పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడింది. వధువును స్వీయ నిర్భంధంలో ఉంచారు అధికారులు

పిఠాపురం: కరోనా అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం నాడు జరగాల్సిన పెళ్లి కరోనా కారణంగా వాయిదా పడింది. వధువును స్వీయ నిర్భంధంలో ఉంచారు అధికారులు. పెళ్లి వాయిదా పడడంతో విదేశాల నుండి వచ్చిన మిత్రులు, బంధువులు నిరాశకు గురయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన యువకుడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన యువతి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. వీరిద్దరూ కూడ ఒకే చోట పనిచేస్తున్నారు.

ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిర్ణయించుకొన్నారు. రెంండు కుటుంబాల పెద్దలకు విషయం చెప్పారు. రెండు కుటుంబాల పెద్దలు కూడ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లి చేసుకొనేందుకు ఈ జంట ఏపీ రాష్ట్రానికి తిరిగి వచ్చారు.

ఈ నెల 22వ తేదీన ఈ జంటకు పెళ్లి చేయాలని రెండు కుటుంబాల పెద్దలు నిర్ణయం తీసుకొన్నారు. పెళ్లి కోసం పిఠాపురంలో ఏర్పాట్లు కూడ చేశారు వధువు కుటుంబసభ్యులు.

పెళ్లి కోసం వధువు వారం రోజుల క్రితమే పిఠాపురం చేరుకొంది. వరుడు కూడ విజయవాడకు చేరుకొన్నాడు.  కరోనా వ్యాధి నేపథ్యంలో విదేశాల నుండి వచ్చిన వారిపై ప్రభుత్వాలు నిఘా ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే పిఠాపురంలో విదేశాల నుండి వచ్చిన జంటకు పెళ్లిని ఈ నెల 22వ తేదీన ఏర్పాటు చేసిన విషయం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీంతో ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 

Also read:ప్రేమ జంట కష్టాలు: మూడుసార్లు పెళ్లి వాయిదా, సెప్టెంబర్‌లోనైనా పెళ్లి జరిగేనా?

దీంతో పిఠాపురంలో వధువు ఇంటికి వెళ్లిన అధికారులు వధువును స్వీయ నిర్భంధంలో ఉండాలని కోరారు. పెళ్లి కోసం విదేశాల నుండి వచ్చిన స్నేహితులు, బంధువులను కూడ అధికారులు పరీక్షల కోసం పంపారు.

14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరాన్ని అధికారులు వధూవరుల కుటుంబసభ్యులకు సూచించారు. దీంతో పెళ్లిని వాయిదా వేశారు.


 

click me!