
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రులు కొలువుదీరారు. వెలగపూడిలోని సచివాలయం మొదటి బ్లాకు పక్కన మంత్రలు ప్రమాణ స్వీకార కార్యక్రమం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ప్రమాణ స్వీకార వేదికపై సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూర్చొన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చదివారు. ఆ ప్రకారం వారితో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆ తర్వాత వరుసగా.. అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్య నారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరాం, జోగు రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్య నారాయణ, కె నారాయణ స్వామి, కేవీ ఉష శ్రీ చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్, రాజన్న దొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజిని ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు.
ఈ కార్యక్రమానికి కొత్తగా ప్రమాణం చేస్తున్న మంత్రుల కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. అయితే మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
హైలెట్స్..
-ప్రమాణ స్వీకారానికి మంత్రుల పేర్లు పిలుస్తున్న సమయంలో వారి అనుచరులు నినాదాలు చేశారు.
- ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త మంత్రులు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌లకు నమస్కారం చేశారు.
- గుడివాడ అమర్‌నాథ్ ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం జగన్‌కు సాష్టాంగ నమస్కారం చేశారు.
-జోగి రమేష్ మొక్కాలపై కూర్చొని జగన్‌కు అభివాదం చేశారు.
- నారాయణ స్వామి సీఎం జగన్‌కు పాదాభివందనం చేశారు.
- రోజా కూడా సీఎం జగన్‌కు పాదాభివందనం చేశారు.. అనంతరం జగన్ చేతిని రోజా ముద్దాడారు.
- విడుదల రజినీ, ఆర్కే రోజా, ఉషా శ్రీ చరణ్ , తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, ఆర్కే రోజా, మేరుగ నాగార్జున
మంత్రుల శాఖల విషయానికి వస్తే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో తీసుకున్న పాత మంత్రుల్లో కొందరికి గతంలో నిర్వహించిన శాఖలే కేటాయించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ శాఖతో పాటుగా మరో కీలక శాఖను అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతుంది.
తొలి మంత్రివర్గం ఏర్పాటు సందర్భంగా చెప్పినట్టుగానే సీఎం జగన్.. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7వ తేదీన ప్రస్తుతం ఉన్న 24 మంత్రులతో రాజీనామా చేయించారు. అయితే అనుహ్యంగా కొత్త మంత్రివర్గంలో 11 మంది పాత వారికి మరోమారు అవకాశం కల్పించారు. కొత్తగా 14 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, విశ్వరూప్, గుమ్మనూరి జయరాం, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, నారాయణస్వామి, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్‌ను మరోమారు సీఎం జగన్ కేబినెట్‌లో అవకాశం కల్పించారు.
కొత్తగా.. ధర్మాన ప్రసాదరావు, రాజన్న దొర, గుడివాడ అమర్‌నాథ్, ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజని, కాకాణి గోవర్ధన రెడ్డి, ఆర్కే రోజా, ఉషా శ్రీచరణ్‌కు మంత్రి పదవులు ఇచ్చారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పాత మంత్రిమండలిని పునర్వ్యవస్థీకరించిన సీఎం జగన్ కొందరు మంత్రులను మరోసారి అవకాశమిచ్చారు. అలా పెద్దిరెడ్డిని కూడా మంత్రిగా కొనసాగించాలని నిర్ణయించగా ఆయన ఇవాళ ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు.
పినిపె విశ్వరూప్ తెలుగులోనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆయన ప్రమాణస్వీకార సమయంలో అమలాపురం వైసిపి నాయకులు, కార్యకర్తలు కొలాహలం చేసారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం జగన్, గవర్నర్ ను కలిసారు. అనంతరం సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర నూతన మంత్రిగా తెలుగులొ ప్రమాణస్వీకారం చేసారు.
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంత్రిగా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణస్వీకారం కోసం రోజా పేరు పిలవగానే ఒక్కసారిగా సభలో కోలాహలం ఏర్పడింది. ఆమె అభిమానులు, వైసిపి నాయకుల కేరింత మధ్య రోజా ప్రమాణస్వీకారం చేసారు. అనంతరం నేరుగా సీఎం జగన్ వద్దకు వెళ్లి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు రోజా.
పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ఆయన ఇటీవలే మంత్రిమండలిలో చేరగా పాతమంత్రులందరితో కలస రాజీనామా చేసారు. అయితే తాజాగా కొన్నిరోజులు మాజీ మంత్రిగా వున్న ఆయన అప్పలరాజు తిరిగా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు.
కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనితకు మరోసారి మంత్రి పదవి దక్కింది. ఇటీవలే మంత్రిపదవికి రాజీనామా చేసిన ఆమె ఇవాళ రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. ప్రమాణస్వీకారం అనంతరం సీఎం జగన్ పాదాలకు నమస్కరించారు.
చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని మంత్రిగా తెలుగులో ప్రమాణస్వీకారం చేసారు. ఆమె ప్రమాణస్వీకార వేదికపైకి వస్తుండగా సభలో కొలాహలం నెలకొంది. ఆమె ప్రమాణస్వీకార సమయంలోనూ వైసిపి శ్రేణులు కేరింతలు ఎక్కువగా వినిపించాయి. పాదాలను నమస్కరించిన ఆమెను జగన్ ఆశీర్వదించారు. అనంతరం ఈ ప్రమాణస్వీకారం జాతీయ గీతంతో ముగిసింది.