రైతులకు ఇబ్బందేమీ లేదు:మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

Published : Sep 02, 2020, 02:48 PM IST
రైతులకు ఇబ్బందేమీ లేదు:మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి

సారాంశం

రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని  ఏపీ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.  

ఒంగోలు: రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తామని  ఏపీ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లను పెట్టాలని కేంద్రం ఆదేశించిందన్నారు. ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడ రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా రైతుల అకౌంట్లో ముందుగానే నగదును జమ చేస్తామని ఆయన చెప్పారు.

ప్రస్తుతం అమలులో ఉన్న ఉచిత విద్యుత్ కొనసాగుతోందన్నారు. రైతులు విద్యుత్ బిల్లుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్  మీటర్లను బిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఉచిత విద్యుత్ బిల్లుల డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు తాము ఉపయోగించిన విద్యుత్ కు రైతులు బిల్లులు చెల్లించనున్నారు.

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు