Nagarjuna Sagar Dam లో మా వాటా నీటినే వాడుకుంటాం:తెలంగాణ ఎన్నికలపై అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు

By narsimha lode  |  First Published Dec 1, 2023, 1:32 PM IST

నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తమ హక్కు వాటా నీటిని వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు.


 తాడేపల్లి:నాగార్జునసాగర్ డ్యామ్ పై  తమ చర్య సరైందేనని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు.శుక్రవారంనాడు  తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.నాగార్జున సాగర్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసుల దండయాత్ర అని చెప్పడం సరైంది కాదన్నారు.  ఈ విషయమై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.


తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదన్నారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆ ప్రభుత్వంతో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని అంబటి రాంబాబు చెప్పారు.తెలంగాణలో ఏ పార్టీని ఓడించాల్సిన అవసరం కూడ తమకు లేదన్నారు.ఏ పార్టీని గెలిపించాల్సిన అవసరం కూడ తమకు లేదని అంబటి రాంబాబు చెప్పారు.తమ వాటాకు మించి ఒక్క నీటి బొట్టును కూడ తమ ప్రభుత్వం వాడుకోదని  అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి  తమ రాష్ట్రానికి రావాల్సిన వాటాను వాడుకుంటామన్నారు. తెలంగాణకు సంబంధించిన వాటాను వాడుకోబోమన్నారు.  ఈ విషయమై అడ్డుగా వచ్చిన తెలంగాణ పోలీసులకు సర్దిచెప్పి పంపించినట్టుగా అంబటి రాంబాబు చెప్పారు.

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  నీటి విడుదలను తెలంగాణ అధికారుల చేతుల్లో ఉందన్నారు.దీన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య  ప్రాజెక్టు నిర్వహణ విషయమై  హక్కులు, బాధ్యతల విషయంలో  సరిగా వ్యవహరించలేదన్నారు. అప్పట్లో చంద్రబాబుపై ఉన్న ఓటుకు నోటు కేసు కారణంగా ఇది జరిగిందని ప్రచారం సాగుతుందని  అంబటి రాంబాబు ఆరోపించారు. ఏ విషయమై  సరైన సమయంలోనే వ్యవహరించాలని ఆయన చెప్పారు. అలా వ్యవహరించకపోతే మళ్లీ సరైన సమయం కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందన్నారు.

తెలుగు రాష్ట్రాల మధ్య వైరుధ్యాలు సృష్టించవద్దని ఆయన కోరారు.కొందరు రెచ్చగొట్టి  గందరగోళం చేయాలని ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. కుడికాల్వకు నీటిని విడుదల చేసేందుకు వెళ్లాలన్నా కూడ తెలంగాణ అధికారుల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులున్నాయన్నారు.చంద్రబాబు అసమర్ధత వల్ల ఆంధ్రప్రదేశ్ వైపు తెలంగాణ పోలీసులు వచ్చారని అంబటి రాంబాబు ఆరోపించారు.తమ రాష్ట్ర హక్కులను కాపాడే ప్రయత్నం మాత్రమే చేసినట్టుగా అంబటి రాంబాబు చెప్పారు.

also read:Nagarjuna Sagar Dam:ఆంధ్రా పోలీసులు, ఇరిగేషన్ అధికారులపై నాగార్జున సాగర్‌లో కేసు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు శ్రీశైలం, తెలంగాణలు ఉమ్మడి ప్రాజెక్టులని ఆయన వివరించారు.ప్రాజెక్టులను కేంద్రం స్వాధీనం చేసుకొంటామంటే ఏపీ అంగీకరించిందని, కానీ తెలంగాణ మాత్రం ఒప్పుకోని విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు.ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు  నాగార్జునసాగర్ ప్రాజెక్టులో సగం ఏపీకే వాటా ఉందని ఆయన చెప్పారు.కానీ, ప్రాజెక్టును తెలంగాణ మాత్రమే నిర్వహిస్తుందన్నారు.చట్టప్రకారంగా  తమ భూభాగంలోకి వెళ్తే తప్పేలా అవుతుందని ఆయన  ప్రశ్నించారు.
 

click me!