గ్రామ పంచాయితీ కార్యాలయాలకు ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా మరో రంగు వేయాలని ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు సస్పెండ్ చేసింది.ఈ విషయమై ఈ నెల 28వ తేదీ లోపుగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: గ్రామ పంచాయితీ కార్యాలయాలకు ప్రస్తుతమున్న మూడు రంగులకు అదనంగా మరో రంగు వేయాలని ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు సస్పెండ్ చేసింది.ఈ విషయమై ఈ నెల 28వ తేదీ లోపుగా వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
గ్రామ పంచాయితీ కార్యాలయాలపై తొలుత మూడు రంగులను వేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మూడు రంగులు వైసీపీ పార్టీ కలర్ ను పోలి ఉన్నాయని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కలర్లను తొలగించాలని కూడ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
undefined
మరో వైపు ఈ మూడు కలర్లకు అదనంగా మరో కలర్ ను వేయాలని జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకొని విచారణ చేసింది. నాలుగు రంగులను పంచాయితీ కార్యాలయాలకు వేయాలని నిర్ణయం తీసుకోవాలని జారీ చేసిన జీవోను హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
also read:జగన్ సర్కార్‌కి షాక్: 623 జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు
హైకోర్టు,సుప్రీంకోర్టు ఆదేశాలను కూడ ప్రభుత్వం పట్టించుకోలేదని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయమై ఈ నెల 28వ తేదీలోపుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి, ఈసీలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ మూడు రంగులతో పాటు, మరో రంగు కూడ ఒక్కో అంశానికి సంబంధించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని ఈ నెల 28న హైకోర్టులో హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే విషయమై ఈ నెల 5వ తేదీన 623 జీవోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.