ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు అధిక ఫీజులు: కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Oct 19, 2020, 3:39 PM IST
Highlights

ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం  చేపట్టిన చర్యలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

అమరావతి: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం  చేపట్టిన చర్యలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.

గుంటూరు కు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు ఏపీ హైకోర్టులో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు ఇవాళ విచారించింది.

రెండు వారాల్లో పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.  ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకొన్నారని హైకోర్టు ప్రశ్నించింది.

కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఏపీ హైకోర్టుకు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో  కరోనా చికిత్స కోసం ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. తాము నిర్ణయించిన ఫీజుల కంటే అధిక ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ కొన్ని ఆసుపత్రులు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయని పలువురు రోగులు ఫిర్యాదు చేశారు.
 

click me!