కోడికత్తి శ్రీను బెయిల్ పై విచారణ... హైకోర్టు కీలక నిర్ణయం

Published : Nov 15, 2023, 03:43 PM IST
కోడికత్తి శ్రీను బెయిల్ పై విచారణ... హైకోర్టు కీలక నిర్ణయం

సారాంశం

  కోడి కత్తి కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉందని నిందితుడు శ్రీను తరపు లాయర్ సలీం తెలిపారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గతంలో జరిగిన కోడి కత్తి దాడి కేసుపై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. జగన్ పై దాడికి పాల్పడిన శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ ను విచారించింది న్యాయస్థానం. అయితే ఈ కేసుపై దర్యాప్తు చేపడుతున్న ఎన్ఐఏ వాదన వినిపించడానికి సమయం కోరింది. దీనికి అంగీకరించిన న్యాయస్థానం విచారణనను వాయిదా వేసింది. 

అయితే ఎప్పటివరకు విచారణ వాయిదా వేయాలో చెప్పాలని ఎన్ఐఏ, నిందితుడి తరపు లాయర్లను న్యాయమూర్తి అడిగారు. డిసెంబర్ 1 వరకు వాయిదా వేయాలని ఎన్ఐఏ లాయర్లు సూచించగా అందుకు నిందితుడు శ్రీనివాస్ తరపు లాయర్లు అభ్యతరం వ్యక్తం చేసారు. దీంతో మద్యేమార్గంగా ఈ నెల 23వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది న్యాయస్థానం. 

ఈ కోడికత్తి కేసు విచారణపై నిందితుడు శ్రీనివాస్ లాయర్ సలీం మాట్లాడుతూ... ఈ కేసులో వాదనలు వినిపించడానికి తాము సిద్దంగా వున్నామన్నారు. కానీ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ లాయర్లు మాత్రం వాదనలు వినిపించడానికి సిద్ధంగా లేమని న్యాయస్థానానికి తెలిపారని అన్నారు.  తదుపరి విచారణ 23వ తేదీకి వాయిదా వేయాలని న్యాయమూర్తిని కోరగా అందుకు అంగీకరించారని తెలిపారు. 

Read More  బిటెక్ రవిని చంపేదుకు కుట్రలు..: బుద్దా వెంకన్న సంచలనం

ఈ కోడికత్తి కేసు విచారణ ఇప్పటికే 80% పూర్తయిందని లాయర్ సలీం తెలిపారు.  సీఎం జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉందని... కానీ సంవత్సర కాలంగా ఆయనను కోర్టుకు రావాలని కోరినా వినింపించుకోవడం లేదన్నారు.  కోర్టుకు రాకుండా పిటిషన్ల మీద పిటిషన్లు వేసి ఈ కేసును జగన్ సాగదీస్తున్నారని అన్నారు. 

సీఎం జగన్ వేసే పిటిషన్ల వల్ల ప్రొసీడింగ్స్ లేట్ అవుతున్నాయని లాయర్ సలీం తెలిపారు. శ్రీను కుటుంబం పనికి ఆహార పథకం చేసే నిరుపేదలని లాయర్ తెలిపారు. కాబట్టి మానవత్వంలో ఆలోచించి ఐదు సంవత్సరాలుగా జైల్లోనే మగ్గుతున్న శ్రీను విడుదలకు సహకరించాలని లాయర్ సలీం కోరారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్