ఏపీలో మరణ మృదంగం: కొత్తగా 11,434 మందికి పాజిటివ్.. గుంటూరు అతలాకుతలం

Siva Kodati |  
Published : Apr 27, 2021, 06:45 PM IST
ఏపీలో మరణ మృదంగం: కొత్తగా 11,434 మందికి పాజిటివ్.. గుంటూరు అతలాకుతలం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే వున్నాయి. దీంతో రోగులు ఆసుపత్రులకు క్యూకడుతున్నారు. అయితే ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. కాగా, గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,434 మందికి కరోనా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 10,54,875కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు కరోనా కారణంగా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో వైరస్ వల్ల ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 7,800కు చేరుకుంది.

గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా విజయనగరంలో 8, అనంతపురం 6, తూర్పుగోదావరి 6, గుంటూరు 6, నెల్లూరు 6, శ్రీకాకుళం 6, చిత్తూరు 5, కర్నూలు 4, ప్రకాశం 4, విశాఖపట్నం 4, పశ్చిమ గోదావరి 4, కృష్ణ 3, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కోవిడ్ నుంచి 7,055 మంది కోలుకున్నారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,47,629కి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 99,446గా వుంది.

గత 24 గంటల వ్యవధిలో 74,435 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,61,43,083 కి చేరుకుంది. నిన్న అనంతపురం 702, చిత్తూరు 1982, తూర్పోగోదావరి 253, గుంటూరు 2028, కడప 271, కృష్ణ 544, కర్నూలు 474, నెల్లూరు 1237, ప్రకాశం 497, శ్రీకాకుళం 1322, విశాఖపట్నం 1067, విజయనగరం 633, పశ్చిమ గోదావరిలలో 424 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?