లాక్‌డౌన్‌లో మద్యం విక్రయాలు: పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు

By narsimha lodeFirst Published Aug 21, 2020, 4:03 PM IST
Highlights

లాక్ డౌన్ లో మద్యం అమ్మడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు కూడ ఇదే విషయాన్ని గతంలో ప్రకటించిన విషయాన్ని ఏపీ హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

అమరావతి: లాక్ డౌన్ లో మద్యం అమ్మడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు శుక్రవారం నాడు కొట్టివేసింది.ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు కూడ ఇదే విషయాన్ని గతంలో ప్రకటించిన విషయాన్ని ఏపీ హైకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది.

గుంటూరు కు చెందిన జీవీ కృష్ణారావు మోమోరియల్ ట్రస్ట్ కన్వీనర్ ఏడుకొండలు ఏపీ హైకోర్టులో లాక్ డౌన్ లో మద్యం విక్రయాన్ని సవాల్ చేస్తూ ఈ ఏడాది మే  6వ తేదీన పిల్ దాఖలు చేశారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారంగా మద్యం విక్రయాన్ని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. 

ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధానాల్లో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేసింది. లాక్ డౌన్ సమయంలో ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది మే 4వ తేదీన మద్యం విక్రయాలను ప్రారంభించింది. మే 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం  మొత్తం 3,468 మద్యం దుకాణాలకు గాను 2,345 మద్యం దుకాణాలు తెరిచారు.
 

click me!