ఏపీ మద్యం ప్రియులకు జగన్ సర్కార్ షాక్: ఇతర రాష్ట్రాల డోర్స్ క్లోజ్

By narsimha lodeFirst Published Oct 26, 2020, 5:34 PM IST
Highlights

 మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిల్స్ ను తీసుకొనేందుకు రాష్ట్రంలో అనుమతి ఉంది. అయితే ఈ అనుమతిని ఎత్తివేసింది ఏపీ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం నుండి ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

అమరావతి: మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిల్స్ ను తీసుకొనేందుకు రాష్ట్రంలో అనుమతి ఉంది. అయితే ఈ అనుమతిని ఎత్తివేసింది ఏపీ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం నుండి ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

also read:ఇతర రాష్ట్రాల నుండి 3 మద్యం బాటిల్స్‌కి ఏపీ హైకోర్టు ఒకే: సవాల్ చేయనున్న ఎక్సైజ్ శాఖ

ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకోవడంపై ఏపీ హైకోర్టు  ఈ ఏడాది సెప్టెంబర్ 2న కీలక తీర్పు ఇచ్చింది.411 జీవో ప్రకారంగా 3 మద్యం బాటిళ్లను తీసుకురావచ్చని ఏపీ హైకోర్టు చెప్పింది. అయితే ఈ జీవోను అమలు చేయాలని రిట్ పిటిషన్ లో  తీర్పు ఇచ్చిన హైకోర్టు.   దీంతో ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకొనే వెసులుబాటు అమల్లోకి వచ్చింది.

దీంతో రాష్ట్రానికి విచ్చలవిడిగా ఇతర రాష్ట్రాల నుండి మద్యం వస్తోంది.సరిహద్దుల్లో పెద్ద ఎత్తున పోలీసులు అక్రమంగా మద్యం తరలిస్తున్నవారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రతి రోజూ వందలాది బాటిల్స్ మద్యం రాష్ట్రంలోకి వస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడ ఆదాయాన్ని కోల్పోతోంది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన 411 జీవోకు సవరణలు చేస్తూ ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇతర రాష్ట్రాల నుండి మూడు మద్యం బాటిల్స్ ను తెచ్చుకోవాలంటే ముందుగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాల్సిందే. అంతేకాదు ఈ మేరకు ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిందే. 

పర్మిట్లు లేకుండా ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకొనేందుకు వీలు లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. పన్నులు చెల్లించి మాత్రమే ఇతర రాష్ట్రాల నుండి మద్యం తెచ్చుకోవచ్చని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఎలాంటి పన్నులు చెల్లించకుండానే ఇతర రాష్ట్రాల నుండి ప్రతి ఒక్కరూ మూడు మద్యం బాటిల్స్ తెచ్చుకొనే వెసులుబాటు ఇక రాష్ట్రంలో ఉండదు.

ఈ విషయమై ఎక్సైజ్ చట్టం ప్రకారం శిక్షకు అర్హులని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

click me!