chandrababu naidu: ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్, విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Nov 21, 2023, 12:29 PM IST


తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడిపై  నమోదైన కేసులకు సంబంధించి కోర్టుల్లో  విచారణ సాగుతుంది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుపై చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ నిర్వహించింది. 


అమరావతి:అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ (సీఐడీ) తరపు న్యాయవాదుల వినతి మేరకు  విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. ఈ నెల  23న విచారణ చేపట్టనున్నట్టుగా ఏపీ హైకోర్టు తెలిపింది.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్  లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు నాయుడితో పాటు  మాజీ మంత్రి పొందుగుల నారాయణ తదితరులపై  ఆంధ్రప్రదేశ్ సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డులో  అలైన్ మెంట్  విషయంలో ఇష్టారీతిలో మార్పులు చేశారని  ఆంధ్రప్రదేశ్ సీఐడీ  కేసు నమోదు చేసింది. తమ అనుయాయులకు ,తమ పార్టీకి చెందినవారికి లబ్ది కలిగించేలా  అలైన్ మెంట్ ను మార్చారని  ఆరోపణలున్నాయి.ఈ విషయమై  అందిన ఫిర్యాదుల మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, ఆ పార్టీకి చెందిన నేతల  సంస్థలకు ప్రయోజనం కల్గించేలా అలైన్ మెంట్ మార్చారని  సీఐడీ అభియోగాలు మోపింది. 

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును  ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్న సమయంలో  మరికొన్ని కేసులను కూడ  సీఐడీ నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసు, ఉచిత ఇసుక అక్రమాలపై కేసు, మద్యం తయారీ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చారని కేసులు నమోదు చేసింది సీఐడీ.

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ ను ఈ ఏడాది అక్టోబర్ 31న  ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.ఇదే కేసులో  ఈ నెల  20న  రెగ్యులర్ బెయిల్ ను కూడ ఏపీ హైకోర్టు ఇచ్చింది. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఆంధ్రప్రదేశ్ సర్కార్ దాఖలు చేయనుంది. 

also read:AP Skill development scamలో చంద్రబాబుకు బెయిల్: రాజకీయ ర్యాలీలు, సభల్లో పాల్గొనేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

మరో వైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై  సుప్రీంకోర్టు ఈ వారంలో తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. 

click me!