4 వేల మెయిల్స్ వచ్చాయి: ఎస్ఈసీ పిటిషన్ విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Jan 12, 2021, 5:49 PM IST

 ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను  ఏపీ హైకోర్టు ధర్మాసనం  ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.


అమరావతి: ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను  ఏపీ హైకోర్టు ధర్మాసనం  ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది.

ఏపీ ఎస్ఈసీ పిటిషన్ పై అత్యవసర విచారణ అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. రెగ్యులర్ కోర్టులో విచారణ చేద్దామని కోర్టు తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని ఎస్ఈసీ గుర్తు చేసింది.

Latest Videos

undefined

స్టే కారణంగా ఎన్నికల ప్రక్రియ జాప్యం అవుతోందని ఎస్ఈసీ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఎన్నికల కమిషన్ కు ఇప్పటికే 4 వేల మెయిల్స్ వచ్చాయని ఆయన చెప్పారు. ఎలక్టోరల్ లిస్ట్ తయారీ కూడ ఆగిపోతోందని ఎస్ఈసీ తెలిపింది. 

also read:ఏపీ ఎస్ఈసీ పిటిషన్: విచారణ వాయిదా వేసిన ఏపీ హైకోర్టు ధర్మాసనం

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన ఫిబ్రవరిలో  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు గాను ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 

కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ అడ్డంకిగా మారే అవకాశం ఉందని భావించిన ఏపీ హైకోర్టు ఏపీ ఎస్ఈసీ ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ ను సోమవారం నాడు సస్పెండ్ చేసింది.

సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ఎస్ఈసీ డివిజన్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ ఉదయం విచారణ ప్రారంభించింది కోర్టు. ఆ తర్వాత మధ్యాహ్నానికి విచారణను ప్రారంభించింది.

మధ్యాహ్నం తర్వాత విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఈ నెల 17వ తేదీ వరకు కోర్టుకు సంక్రాంతి సెలవులు.

ఈ నెల 18వ  తేదీన కోర్టు తిరిగి ప్రారంభంకానున్నాయి. కోర్టు తిరిగి ప్రారంభం కాగానే ఈ కేసు విచారణను ప్రారంభించనున్నారు.

click me!