దుల్హన్ పథకం అమలుకు నిధులు లేవు.. హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం..

By Sumanth KanukulaFirst Published Jun 23, 2022, 3:14 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమలులో లేదని పేర్కొంది. 

ఆంధ్రప్రదేశ్‌లో దుల్హన్ పథకాన్ని నిలిపివేస్తున్నట్టు సీఎం జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం అమలులో లేదని పేర్కొంది. దుల్హన్‌ పథకం నిలిపివేతను సవాల్‌ చేస్తూ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు షారుఖ్ షిబ్లి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మైనారిటీలు ఎదురుచూస్తున్న దుల్హన్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఊరట కల్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని  కోరారు. 

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ప్రభుత్వం ఈ పథకం అమలు చేయలేకపోతోందని తెలిపారు. వాదనలు విన్న జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా ధర్మాసనం.. అఫిడవిట్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

click me!