జల జగడం: తెలంగాణ డీపీఆర్‌లు ఆమోదించొద్దని జీఆర్ఎంబీకి ఏపీ లేఖ

By narsimha lodeFirst Published Sep 30, 2021, 9:26 AM IST
Highlights

 తెలంగాణ డీపీఆర్‌లను ఆమోదించొద్దు  గోదావరి బోర్డుకు, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.   గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టం,  జీఆర్ఎంబీ నిబంధనలకు విరుద్దంగా ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం జీఆర్ఎంబీకి సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించవద్దని ఏపీ ప్రభుత్వం కోరింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (andhra pradesh), తెలంగాణ (telangana)రాష్ట్రాల మధ్య జల జగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రాష్ట్రాలు కేఆర్ఎంబీ(krmb), జీఆర్ఎంబీలకు(grmb) పరస్పరం ఫిర్యాదు చేసుకొంటున్నాయి.తాజాగా జీఆర్ఎంబీకి , కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.

గోదావరి జల వివాద ట్రిబ్యునల్ , ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి విరుద్దంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తోందని ఆ లేఖలో  ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరేవరకు లేదా కొత్త ట్రిబ్యునల్ అవార్డు వచ్చేవరకు గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లను ఆమోదించవద్దని ఏపీ  ప్రభుత్వం కోరింది.

గోదావరి నదిపై ఎగువన తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు నీటి  ప్రవాహం తగ్గిపోతోందని ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై సీతారామ, తుపాకులగూడెం సహా మరో ఐదు ప్రాజెక్టుల నిర్మాణం కోసం డీపీఆర్‌లను పంపింది. ఈ డీపీఆర్‌లను ఆమోదించవద్దని ఏపీ ప్రభుత్వ నీటి పారుదల శాఖ సెక్రటరీ శ్యామలరావు జీఆర్ఎంబీకి లేఖ రాశారు.

 

click me!