ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డిపై బదిలీ వేటు పడింది. కోనసీమ జిల్లానే కొనసాగించాలని సాగిన ఆందోళన విధ్వంసానికి దారి తీసిన విషయం తెలిసిందే.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు IPS అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. Konaseema జిల్లా ఎస్పీ Subba Reddyని బదిలీ చేసింది.కర్నూలు జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ గా నియమించింది. కృష్ణా జిల్లా ఎస్పీ గా పి జాషువా ను నియమించింది.విజయవాడ నగర శాంతిభద్రతల డిసిపిగా విశాల్ గున్నీని నియమించారు. కోనసీమ జిల్లా ఎస్పీగా సుధీర్ కుమార్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. మంగళగిరిలోని ఆరో బెటాలియన్ కమాండెంట్ గా ఎస్ ఎస్ వి సుబ్బారెడ్డిని నియమించారు. సుబ్బారెడ్డి కోనసీమ జిల్లా ఎస్పీగా ఉన్నారు.
కోనసీమ జిల్లా పేరునే కొనసాగించాలని కోరుతూ ఆందోళనకారుల ఈ ఏడాది మే 24న నిర్వహించిన ఆందోళన విధ్వంసానికి దారి తీసింది. పోలీసులపై దాడికి దిగారు ఆందోళనకారులు. మరో వైపు మంత్రి విశ్వరూప్ రెండు ఇళ్లను దగ్దం చేశారు. ఎమ్మెల్యే సతీష్ ఇంటికి నిప్పంటించారు. అమలాపురానికి ఇతర జిల్లాల నుండి భారీ పోలీస్ బందోబస్తు రప్పించిని తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అమలాపురం అల్లర్ల కేసులో 116 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
2021 జూన్ 14న ఏపీలొ ఐపీఎస్ ల బదిలీలు నిర్వహించారు. మొత్తం 13 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది జగన్ సర్కార్. ప్రకాశం జిల్లా ఎస్పీ గా మాలికా గర్గ్ నియమితులయ్యారు. విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ అజిత్ వేజెంట్ల, కాకినాడ బెటాలియన్ కమాండెంట్ గా జిఎస్ సునీల్ నియమితులయ్యారు.
ఇక రాజమండ్రి అర్బన్ ఎస్పీ గా ఐశ్వర్య రస్తోగి, విశాఖ డిసిపి వన్ గా గౌతమి సలి బాధ్యత చేపట్టనున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా జిందాల్, విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీ గా షిమునిని నియమించింది జగన్ సర్కార్.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీ గా కోయ ప్రవీణ్, ఏపీ ఎస్పీ విజయనగరం బెటాలియన్ కామాండెంట్ గా విక్రంత్ పాటిల్, డిజిపి ఆఫీస్ లో అర్ఎం గా అమ్మిరెడ్డిని నియమించారు. నారాయణ నాయక్ ను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
2019 జూన్ 5న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ లు, ఐఎఎస్ ల బదిలీని చేపట్టింది జగన్ సర్కార్. 50 మంది ఐఏఎస్ లను బదిలీ చేసిన వైయస్ జగన్ సర్కార్. ఐపీఎస్ ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది ఐపీఎస్ లపై బదిలీ వేటు వేశారు వైయస్ జగన్.