Chalo Rajbhavan : పోలీస్ స్టేషన్లోనే ఏపి కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ కు అస్వస్థత...

Arun Kumar P   | Asianet News
Published : Jun 16, 2022, 02:39 PM ISTUpdated : Jun 16, 2022, 02:54 PM IST
Chalo Rajbhavan : పోలీస్ స్టేషన్లోనే ఏపి కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ కు అస్వస్థత...

సారాంశం

ఛలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చిన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ లోనే అస్వస్థతకు గురయ్యారు. 

విజయవాడ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ (sonia gandhi), ఆమె తనయుడు రాహుల్ గాంధీ (rahul gandhi)పై ఈడీ అక్రమకేసులు బనాయించడం, విచారణ పేరిట వేధించడంపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టింది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు సాకె శైలజానాథ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఆందోళనకు సిద్దమవగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శైలజానాథ్ (sake sailajanath) తో పాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులను  పోలీసులు కృష్ణలంక స్టేషన్ కు తరలించారు. 

అయితే పోలీస్ స్టేషన్ లో శైలజానాథ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా ఆయన రక్త పోటు (బిపి) పెరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయనకు ప్రథమ చికిత్స చేసి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. 

ఇక కొందరు నాయకులను హౌస్ అరెస్ట్, మరికొందరిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజ్ భవన్ వద్ద ఎలాంటి ఆందోళనలు జరక్కుండా చూసుకున్నారు. రాజ్ భవన్ వద్ద నిరసనలకు అనుమతి లేదని ప్రకటించిన పోలీసులు అందుకు సిద్దమవుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించగా శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. 

ఇదిలావుంటే తెలంగాణ కాంగ్రెస్ (telangana congress) చేపట్టిన ఛలో రాజ్ భవన్ (chalo rajbhavan) ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ కు వెళ్ళేందుకు ఖైరతాబాద్ చౌరస్తా వద్ద గుమిగూడారు. ఈ క్రమంలోనే కొందరు కార్యకర్తలు వాహనాలపై దాడికి దిగారు.  కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఓ బైక్ పై పెట్రోల్ పోసి నిప్పంటించగా మరికొందరు ఆర్టిసి బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్సుపై నిలబడి ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
 
ఇక రాజ్ భవన్ వైపు కాంగ్రెస్ శ్రేణులు వెళ్లకుండా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికి పోలీసుల భద్రతను చేధించుకొని కాంగ్రెస్ నేతలు కొందరు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నారు. రాజ్ భవన్ పైపునకు వెళ్తున్న సీఎల్పీ నేత  మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) ను డీసీపీ జోయల్ డేవిస్ నేతృత్వంలో పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో డిసిపి సహా పోలీసులతో భట్టి వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో డీసీపీ జోయల్ డేవిస్ ను భట్టి వెనక్కి నెట్టివేశారు. 

పోలీస్ వలయాన్ని చేధించుకుని రాజ్ భవన్ వైపు దూసుకెళ్లేందుకు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులతో ఆమె దురుసుగా ప్రవర్శించారు. తన టచ్ చేయవద్దంటూ పోలీసులను హెచ్చరిస్తూ పంజాగుట్ట ఎస్సై ఖాకీచొక్కా పట్టుకుని లాగారు. దీంతో మహిళా పోలీసులు ఆమెను కంట్రోల్ చేసి వాహనంలో అక్కడినుండి తరలించారు. 

ఇలా పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేసారు. భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి (renuka chowdary)తో పాటు ఖైరతాబాద్ జంక్షన్ లో ఉద్రిక్తతకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్