ఏపీలో స్కూల్స్ రీ ఓపెన్ వాయిదా:నవంబర్ 2న పాఠశాలల ప్రారంభం

By narsimha lodeFirst Published Sep 29, 2020, 3:34 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా స్కూళ్ల పున: ప్రారంభోత్సవాన్ని  నవంబర్ రెండో తేదీకి వాయిదా వేశారు. తొలుత  అక్టోబర్ 5వ తేదీన ప్రారంభించాలని భావించారు. కరోనా నేపథ్యంలో నవంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా స్కూళ్ల పున: ప్రారంభోత్సవాన్ని  నవంబర్ రెండో తేదీకి వాయిదా వేశారు. తొలుత  అక్టోబర్ 5వ తేదీన ప్రారంభించాలని భావించారు. కరోనా నేపథ్యంలో నవంబర్ 2వ తేదీకి వాయిదా వేశారు.

ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగళవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు. సెప్టెంబర్ నుండి స్కూళ్లను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈ క్రమంలోనే కరోనా ను పురస్కరించుకొని అక్టోబర్ 5వ తేదీకి స్కూళ్లను పున: ప్రారంభించాలని తొలుత విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది.

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గలేదు. దీంతో ఏపీలో స్కూళ్ల పున: ప్రారంభోత్సవాన్ని నవంబర్ రెండో తేదీకి వాయిదా వేసినట్టుగా మంత్రి ఇవాళ తెలిపారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో అక్టోబర్ 5న యధావిధిగా ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఏదో ఒక స్కూల్ కు కూడ వెళ్తారని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. 

click me!