మామిళ్లపల్లె క్వారీ పేలుడు: ఐదు శాఖలతో కమిటీ, ఐదు రోజుల్లో నివేదికకు ప్రభుత్వం ఆదేశం

Published : May 09, 2021, 02:35 PM IST
మామిళ్లపల్లె క్వారీ పేలుడు: ఐదు శాఖలతో కమిటీ, ఐదు రోజుల్లో నివేదికకు ప్రభుత్వం ఆదేశం

సారాంశం

కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీలో  పేలుడు ఘటనపై  ఐదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 

కడప: కడప జిల్లా మామిళ్లపల్లె క్వారీలో  పేలుడు ఘటనపై  ఐదు ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఐదు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కడప జిల్లా మామిళ్లపల్లెలోని క్వారీలో పేలుడు ఘటనలో తొమ్మిది మంది మరణించారు. ఈ విషయమై ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ ఘటనకు కారణాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు గాను  ఐదు ప్రభుత్వ శాఖలతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారంనాడు ప్రకటించారు. 

also read:క్వారీ ప్రమాదం: పవన్ దిగ్బ్రాంతి.. బాధితులకు ప్రభుత్వోద్యోగం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్

క్వారీని లీజుకు తీసుకొన్న నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. క్వారీని నిర్వహిస్తున్న యజమానిపై చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. సీఎం స్వంత జిల్లాలో భారీ ప్రమాదం జరగడంపై  రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు గల కారణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 


 

PREV
click me!

Recommended Stories

Reddappagari Madhavi Reddy Satirical Comments On YSRCP Party | Asianet News Telugu
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?