కారు ఢీకొని రైతు మృతి: మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్

Published : May 09, 2021, 09:14 AM IST
కారు ఢీకొని రైతు మృతి: మద్యం మత్తులో వాహనం నడిపిన డ్రైవర్

సారాంశం

మద్యం మత్తులో కారును నడుపుతూ  ఓ రైతు ప్రాణాలను బలిగొన్నారు యువకులు. ఈ ఘటన గుంటూరు జిల్లా భట్టిప్రోలులో చోటు చేసుకొంది. 

గుంటూరు: మద్యం మత్తులో కారును నడుపుతూ  ఓ రైతు ప్రాణాలను బలిగొన్నారు యువకులు. ఈ ఘటన గుంటూరు జిల్లా భట్టిప్రోలులో చోటు చేసుకొంది. భట్టిప్రోలు గ్రామానికి చెందిన రైతు పోతాబత్తుని వెంకట సుబ్బారావు  తమ పొలంలో వరి కోయిస్తున్నాడు. తన పొలంలో పనిచేసేందుకు వచ్చిన కూలీలకు  కూల్‌డ్రింక్స్ తెచ్చేందుకు  భట్టిప్రోలుకు వచ్చాడు. కూల్‌డ్రింక్స్ ను తీసుకొని తన పొలానికి వెళ్తుండగా కోడిపర్రు సమయంలో వేగంగా వచ్చిన కారు సుబ్బారావు బైక్ ను ఢీకొట్టింది. సుబ్బారావు బైక్ తో పాటు ఆయనను రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి  లాక్కెళ్లింది కారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. 

కారు ముందు బాగం నుజ్జునుజ్జయింది.  ఈ కారులో ఇదే మండలంలోని కోళ్లపాలెం గ్రామానికి చెందిన  నీలా శివరామకృష్ణ, మేరుగ కిరణ్ కుమార్, దోవా రమేష్, దోవా ప్రకాష్, శరత్ బాబులున్నారు. మద్యం మత్తులో కారును నడపడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని  ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సుబ్బారావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

Wine Shop: మందు బాబుల‌కు కిక్కిచ్చే న్యూస్‌.. రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు వైన్స్ ఓపెన్
Tirumala Temple Decoration: ఇల వైకుంఠాన్ని తలపించేలా తిరుమల ఆలయం| Asianet News Telugu