AP Cabinet Reshuffle: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహుర్తం ఖరారు..?

Published : Mar 26, 2022, 11:40 AM IST
AP Cabinet Reshuffle: ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ముహుర్తం ఖరారు..?

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కేబినెట్ సహచరులకు ఇదివరకే సంకేతాలు కూడా ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కేబినెట్ సహచరులకు ఇదివరకే సంకేతాలు కూడా ఇచ్చారు. పదవి నుంచి తప్పించిన మంత్రులు పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించనున్నట్టుగా సీఎం జగన్ చెప్పారు. అయితే త్వరలో జరిగే ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైనట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఏప్రిల్ 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారని ప్రచారం జరుగుతుతోంది. 

మంత్రివర్గంలో చేయబోయే మార్పుల గురించి సీఎం జగన్ ఓ క్లారిటీకి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గంలో ప్రస్తుతం ఉన్నవారిలో ఎవరెవరరూ బెర్త్‌లు కోల్పోనున్నారు..? కొత్తగా అవకాశం దక్కించుకునేవారు ఎవరనేదానిపై వైసీపీ సర్కిల్స్‌లో తెగ చర్చ సాగుతుంది. మంత్రివర్గంలో నుంచి ఉద్వాసన తప్పదేమోనని చాలా మంది మంత్రులు టెన్షన్ పడుతున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు మాత్రం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

ఇక, గత కొంతకాలంగా సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్టుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం జగన్.. అప్పుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గం రెండున్నర ఏళ్లు మాత్రమే ఉంటుందని చెప్పారు. రెండున్నరేళ్ల తర్వాత కొత్తవారికి కేబినెట్‌లో చోటు కల్పిస్తానని అన్నారు. దాదాపు 90 శాతం మంది మంత్రులను మార్చి.. తొలి విడుతలో అవకాశం దక్కనివారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడే ఆ దిశలోనే మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు తెలిపాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu