ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమీపంలో అగ్నిప్రమాదం... తప్పిన ఫెనుప్రమాదం

Arun Kumar P   | Asianet News
Published : Apr 22, 2020, 09:18 PM IST
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమీపంలో అగ్నిప్రమాదం... తప్పిన ఫెనుప్రమాదం

సారాంశం

తాడేపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సమీపంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 

తాడేపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద ఫెను ప్రమాదం తప్పింది. ఈ కార్పోరేషన్ వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. అయితే ఈ మంటలను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే సమాచారం ఇవ్వటంతో అధికారులు సకాలంలో స్పందించారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో  ఫెను ప్రమాదం తప్పింది. 

పెద్దఎత్తున మంటలు ఎగసిపడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తేవడంతో ఇండియన్ ఆయిల్ కార్ఫోరేషన్ కు ప్రమాదం తప్పింది. కార్పొరేషన్ వెనక భాగాన ఉన్నటువంటి పాత టైర్లు, చెత్తకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మంటలు ఎగిసిపడుతున్నా ఐఓసీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. స్థానికులు ఈ మంటల గురించి సమాచారం ఇవ్వడంతో  ప్రమాదం తప్పింది. ఐఓసి సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం