పర్యాటకుల భద్రతకు పెద్దపీట: పర్యాటక పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన వైఎస్ జగన్

Published : Feb 14, 2023, 01:21 PM IST
పర్యాటకుల భద్రతకు పెద్దపీట: పర్యాటక పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన  వైఎస్ జగన్

సారాంశం

 రాష్ట్రంలో  పర్యాటకుల భధ్రతను లక్ష్యంగా  చేసుకుని  రాష్ట్ర ముఖ్యమంత్రి  వైఎస్ జగన్   పర్యాటక కేంద్రాల్లో పోలీస్ స్టేషన్లను  ప్రారంభించారు.   


అమరావతి: పర్యాటకుల భద్రత కోసం పర్యాటక ప్రాంతాల్లో  పోలీస్ స్టేషన్లను  ప్రారంభిస్తున్నట్టుగా  ఏపీ సీఎం వైఎస్ జగన్  చెప్పారు.మంగళవారం నాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో  26 పర్యాటక పోలీస్ స్టేషన్లను  ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి  సీఎం జగన్ వర్చువల్ గా  ఈ పోలీస్ స్టేషన్లను  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్  మాట్లాడారు.  పోలీస్ శాఖలో  అనేక  సంస్కరణలు తీసుకువచ్చిన విషయాన్ని సీఎం జగన్  గుర్తు  చేశారు.  ఫ్రెండ్లీ పోలిసింగ్  విధానం అమలౌతున్న విషయాన్ని జగన్  ప్రస్తావించారు.  

పర్యాటక ప్రాంతాల్లో  కూడా  ప్రజలకు  ఎలాంటి ఇబ్బందులు లేకుండా  ఉండేందుకు గాను పర్యాటక ప్రాంతాల్లో  పోలీస్ స్టేషన్లను  ప్రత్యేకంగా  ప్రారంభించినట్టుగా  సీఎం జగన్ వివరించారు. ఇతర ప్రాంతాల నుండి పర్యాటక ప్రాంతాలకు  వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది, భయం లేకుండా  ఈ పోలీసులు చర్యలు తీసుకుంటారని సీఎం జగన్ చెప్పారు. 

 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్