కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వాసుపత్రులు: కర్నూల్‌లో జగన్

By narsimha lodeFirst Published Feb 18, 2020, 1:40 PM IST
Highlights

మూడో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు కర్నూల్ లో ప్రారంభించారు. 


కర్నూల్: కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల రూపు రేఖలను మార్చుతామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.  మూడో దశ కంటి వెలుగు కార్యక్రమాన్ని కర్నూల్ జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ప్రారంభించారు.

మూడు దశల్లో ప్రభుత్వాసుపత్రులు నాడు- నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా సీఎం చెప్పారు. కర్నూల్ జిల్లా నుండి రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

 ఆసుపత్రుల రూపు రేఖలను మార్చేందుకు ఆసుపత్రుల నాడు- నేడు కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా జగన్ చెప్పారు. ప్రభుత్వాసుపత్రులను కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

మొదటి దశలో ఆసుపత్రుల నాడు-నేడు కార్యక్రమానికి మొదటి దశలో రూ.  15,335 కోట్లతో ఆసుపత్రులను అభివృద్ది చేస్తామన్నారాయన. మూడేళ్ల తర్వాత ఆసుపత్రుల్లో మార్పులు చూడొచ్చని ఆయన  చెప్పారు. ఆసుపత్రుల నాడు- నేడు కార్యక్రమానికి మొదటి దశలో రూ.1,129 కోట్లను ఖర్చు చేస్తామని  జగన్ చెప్పారు.

రెండో దశలో పీహెచ్‌సీ, కమ్యూనిటీ సెంటర్లను అభివృద్ధి చేస్తామని సీఎం తెలిపారు.  రూ. 700 కోట్లతో ఏరియా ఆసుపత్రులను ఆధునీకరించనున్నట్టుగా సీఎం స్పష్టం చేశారు.  మూడో దశలో 56. 88 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. కర్నూల్ నుండి మూడో దశ కంటి వెలుగును ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని  జగన్ తెలిపారు. 
 

click me!