వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే: రాజమండ్రిలో అధికారులతో సమీక్ష

By narsimha lode  |  First Published Jul 15, 2022, 4:41 PM IST

గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు ఏరియల్ సర్వే నిర్వహించారు.  విశాఖపట్టణం నుండి సీఎం జగన్ ఏరియల్  సర్వేకు వెళ్లారు. 


రాజమండ్రి: Godavari వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం YS Jagan శుక్రవారం నాడు Aerial survey నిర్వహించారు. ఇవాళ విశాఖపట్టణంలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్నతర్వాత  విశాఖపట్టనం నుండి సీఎం జగన్ గోదావరి ముంపు గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలించేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు.

 భద్రాచలం దిగువన గోదావరి మరింత పోటెత్తిన పరిస్థితి నెలకొంది పోలవరంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితిని సీఎం జగన్ పరిశీలించారు.ఏరియల్ సర్వే పూర్తైన తర్వాత  రాజమండ్రిలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి వరద ముంపుపై  అధికారులను సీఎం జగన్ అడిగి తెలుసుకొనే అవకాశం ఉంది. వకద ముంపు గ్రామాల్లో తీసుకున్న చర్యలతో పాటు  రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేయనున్నారు. 

Latest Videos

వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సీఎం జగన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పునరావాస కేంద్రాల నుండి ఇంటికి వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి  రెండు వేలు చెల్లించాలని సీఎం జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే.  గోదావరి నదికి వరద పోటెత్తడంతో  గోదావరి పరివాహ క ప్రాంతంలోని సుమారు 554  గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 
 

click me!