సొంతోళ్ల మధ్యనే సీఎం జగన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ... మూడ్రోజులు అక్కడే... 

Published : Dec 22, 2023, 11:00 AM ISTUpdated : Dec 22, 2023, 11:14 AM IST
సొంతోళ్ల మధ్యనే సీఎం జగన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ... మూడ్రోజులు అక్కడే... 

సారాంశం

ప్రతిసారిలా ఈ క్రిస్మస్ రోజున కూడా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల సిఎస్ఐ చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు సీఎం కడప జిల్లాలో వుండనున్నారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ వేడుకల కోసం స్వస్థలానికి వెళుతున్నారు. చిన్ననాటినుండి ప్రతి క్రిస్మస్ కు సొంతూరు పులివెందులకు వెళ్లడం... సొంత మనుషుల మధ్య వేడుకలు జరుపుకోవడం జగన్ కు అలవాటు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే సాంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ వున్నా క్రిస్మస్ రోజు పులివెందులలో వుంటారు. ఇలా ఈసారి కూడా ఎన్నికల హడావిడి మొదలైనా క్రిస్మస్ ఫెస్టివల్ కోసం స్వస్థలానికి వెళుతున్నారు. 

రేపటినుండి అంటే డిసెంబర్ 23న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు వెళ్ళనున్నారు. రెండురోజుల పాటు కడపలో వివిద అభివృద్ది, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న జగన్ ఇడుపులపాయ వైఎస్సార్ ఎస్టేట్ లో బస చేయనున్నారు. 25న క్రిస్మస్ వేడకల కోసం పులివెందులకు వెళ్ళనున్నారు. అక్కడ వైఎస్ కుటంబం, స్థానిక ప్రజలతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అనంతరం అక్కడినుండే తాడేపల్లికి బయలుదేరనున్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప పర్యటన షెడ్యూల్ ను సీఎంవో కార్యాలయం ప్రకటించింది. 23న ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి కడపకు బయలుదేరనున్నారు. కడపలో మొదట సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ప్రారంభించనున్నారు. ఆ పరిశ్రమ చైర్మన్ సజ్జన్ భజాంకతో పాటు ఉద్యోగులు, కార్మికులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. 

Also Read  వైసీపీలో స్థానచలనాలు ఎస్సీలకేనా? ఇప్పటివరకు ఎంతమందిని మార్చారంటే...

కడపలో ప్రభుత్వం నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇదే రిమ్స్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన క్యాన్సర్ కేర్ బ్లాక్ ను ప్రారంభించనున్నారు. వైఎస్సార్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌,  ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని కూడా జగన్ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత తన తాత వైఎస్ రాజారెడ్డి పేరుతో వున్న క్రికెట్ గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన ప్లడ్ లైట్లను సీఎం చేతులమీదుగా వెలిగించనున్నారు. అధునీకరించిన కలెక్టర్ కార్యాలయం, అంబేద్కర్ సర్కిల్, వై జంక్షన్,కోటిరెడ్డి, సెవెన్ రోడ్స్ సర్కిల్స్ ని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. ఇలా అధికారిక కార్యక్రమాలన్ని ముగించుకుని రాత్రికి ఇడుపులపాయ ఎస్టేట్ కు సీఎం చేరుకోనున్నారు. 

డిసెంబర్ 24న ఉదయం తన తండ్రి వైఎస్సార్ ఘాట్ కు చేరుకుని నివాళి అర్పించనున్నారు సీఎం జగన్. అనంతరం ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం సింహాద్రిపురంలో పలు అభివృద్ది పనుల్లో పాల్గోననున్నారు. ఆ తర్వాత ఇడుపులపాయలోనే సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులతో సమావేశం కానున్నారు. 2024 ఎన్నికల సంవత్సరం కాబట్టి గెలుపుకోసం ఎలా పనిచేయాలో వివరించనున్నారు. 

ఇక డిసెంబర్ 25 అంటే క్రిస్మస్ రోజు ఇడుపులపాయ ఎస్టేట్ నుండి నేరుగా పులివెందుల సిఎస్ఐ చర్చికి సీఎం జగన్ చేరుకుంటారు. ప్రతి ఏడాదిలాగే కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. ఈ క్రిస్మస్ ప్రార్థనలు ముగియగానే తాడేపల్లికి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?