రూ. 10 వేల కోట్ల పెట్టుబడే లక్ష్యంగా ఈఎంసీ పార్క్: పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసిన జగన్

By narsimha lodeFirst Published Sep 3, 2021, 12:30 PM IST
Highlights


 పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ఏపీ సీఎం జగన్ నిధులను  శుక్రవారం నాడు విడుదల చేశారు. రూ. 10 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంా వైఎస్ఆర్ ఈఎంసీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 
 

అమరావతి:రూ. 10 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా వైఎస్ఆర్ ఈఎంసీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. పరిశ్రమలకు ప్రోత్సాహక రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో భాగంగా రెండో  ఏడాది రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు నిధులను శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ సందర్భంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా సీఎం జగన్  లబ్దిదారులతో మాట్లాడారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతోందన్నారు సీఎం జగన్.  కరోనా సమయంలోనూ అనేక సంక్షేమ పథకాలను కొనసాగించిన విషయాన్నిఆయన గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈలకు రూ. 440 కోట్ల ప్రోత్సాహకాలను అందిస్తున్నామన్నారు సీఎం జగన్. టెక్స్‌టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ కు  రూ.684 కోట్లు జమ చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు.

తమ ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలతో ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని సీఎం జగన్ చెప్పారు. పారిశ్రామిక రంగానికి కావాల్సిన విద్యుత్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని జగన్ వివరించారు. రాష్ట్రంలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కరోనా కారణంగా ఒక్క ఫ్యాక్టరీ కూడ మూతపడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్ల ప్యాకేజీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

9.15 లక్షల మంది చిరువ్యాపారులకు సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. గత ప్రభుత్వం చెల్లించకుండా ఉన్న బకాయిలు రూ. 1588 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకు రూ. 2,086 కోట్ల ప్రోత్సాహకాలు అందించినట్టుగా జగన్ తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 62 శాతం, మహిళలకు 42 శాతం ప్రోత్సాహకాలు అందిస్తామని జగన్ వివరించారు.  త్వరలోనే రాష్ట్రంలో మరో 62 భారీ ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని ఆయన వివరించారు. భావనపాడు, మచిలీపట్టణం, రామాయపట్నంలలో గ్రీన్ ఫీల్డ్ పోర్టులను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టామని సీఎం జగన్ తెలిపారు. మరో 9 కొత్త ఫిషింగ్ హార్బర్ లను ఏర్పాటు చేయబోతున్నామని ఆయన తెలిపారు.


 

click me!