నెల్లూరులో కాకాని, అనిల్‌ పోటాపోటీ సభలు: ఇద్దరికి వైసీపీ అగ్రనేతల ఫోన్, కట్టు దాటితే వేటే

By narsimha lodeFirst Published Apr 17, 2022, 11:21 AM IST
Highlights

నెల్లూరు జిల్లాలోని వైసీపీ నేతల మధ్య అభిప్రాయ బేధాలపై ఆ పార్టీ హైకమాండ్ కేంద్రీకరించింది. మాజీ మంత్రి అనిల్ కుమార్, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిలతో వైసీపీ నాయకత్వం చర్చించినట్టుగా సమాచారం.


నెల్లూరు: Nellore జిల్లాకు చెందిన YCP నేతల మధ్య అభిప్రాయబేధాలపై ఆ పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. మాజీ మంత్రి Anil kumar, మంత్రి Kakani Govardhan Reddyకి  వైసీపీకి చెందిన కీలక నాయకులు ఫోన్ చేసినట్టుగా సమాచారం. పార్టీకి నష్టం చేసే పనులు చేయవద్దని సూచించారని తెలిసింది.పార్టీ కట్టు దాటితే చర్యలు తప్పవని వైసీపీ అధిష్టానం హెచ్చరించినట్టుగా సమాచారం.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారిగా ఇవాళ నెల్లూరు జిల్లాకు రానున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి తొలిసారిగా జిల్లాకు వస్తున్నందున ఆయన వర్గీయులు పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేశారు. అయితే  ఇవాళే  మాజీ మంత్రి అనిల్ కుమార్ కూడా నెల్లూరు గాంధీ సెంటర్ లో కూడా సభను అనిల్ కుమార్ ఏర్పాటు చేశారు.  ఒకే రోజున నెల్లూరు పట్టణంలో  ఒకే పార్టీకి చెందిన నేతలు సభలు ఏర్పాటు  చేయడం చర్చకు దారితీసింది.

జగన్ గత మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా నుండి అనిల్ కుమార్,  మేకపాటి గౌతం రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. అనారోగ్యంతో ఇటీవలనే మేకపాటి గౌతం రెడ్డి మరణించారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో కాకాని గోవర్ధన్ రెడ్డికి YS Jagan చోటు చకల్పించారు. నెల్లూరు జిల్లా నుండి అనిల్ కుమార్ మంత్రివర్గంలో చోటును కోల్పోయారు.

అనిల్ కుమార్ గత టర్మ్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కాకాని గోవర్ధన్ రెడ్డి తనకు సరిగా సహకరించలేదని అనిల్ కుమార్ సీఎం జగన్ కు ఫిర్యాదు చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నీటి పారుదల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి అనిల్ కుమార్ పై కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శలు చేశారు. ఈ పరిణామాలను సీఎం జగన్ దృష్టికి అనిల్ కుమార్ తీసుకెళ్లారు. దీంతో జగన్ వారిని పిలిపించి మాట్లాడారని సమాచారం.

ఈ నెల 11న కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి అనిల్ కుమార్ హాజరు కాలేదు. తనకు కాకాని గోవర్ధన్ రెడ్డి నుండి ఆహ్వానం అందని కారణంగానే తాను ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని ఆయన చెప్పారు. గతంలో తనకు ఏ మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి సహకరించారో అంతకు రెట్టింపు స్థాయిలో సహకరిస్తానని కూడా ఆయన చెప్పారు. నెల్లూరు పట్టణంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వాగతం తెలుపుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. అయితే దీని వెనుక మాజీ మంత్రి అనిల్ కుమార్ వర్గీయులే కారణమని కాకాని గోవర్ధన్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. మరో వైపు  మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో గత వారంలో అనిల్ కుమార్ భేటీ అయ్యారు. ఆ భేటీ ముగిసిన మరునాడే Kotamreddy Sridhar Reddy తో భేటీ అయ్యారు అనిల్ కుమార్. కాకాని గోవర్ధన్ రెడ్డి వైరి వర్గంతో అనిల్ కుమార్  భేటీ కావడం ప్రాధాన్యత చోటు చేసుకొంది.

ఇవాళ నెల్లూరుకి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రానున్నారు. దీంతో పార్టీ కార్యాలయ ఆవరణలో సభను ఏర్పాటు చేశారు. అయితే అదే సమయంలో గాంధీ సెంటర్ లో మాజీ మంత్రి అనిల్ కుమార్ సభను ఏర్పాటు చేశారు. అయితే  అనిల్ కుమార్ సభ ప్రాంతం నుండి కాకుండా మరో మార్గం గుండా మంత్రి  కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ కార్యాలయానికి చేరుకునేలా పోలీసులు ఒప్పించారు.

click me!