ఆంధ్రప్రదేశ్ లో ఉద్రిక్తతలకు దారితీసిన రామతీర్థం విగ్రహధ్వంసం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం సీఐడీ బృందం రామతీర్థంలో పర్యటించి, బోడికొండపై ఉన్న కోదండ రాముడి విగ్రహం ధ్వంసం ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

రామతీర్థం ఘటనపై ఏపీ ప్రభుత్వం సీఐడీ దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో అదనపు డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాలను పరిశీలించిన తరువాత సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
undefined
ఈ ఘటన జరిగిన తీరును చూస్తుంటే పక్కా ప్రణాళికతోనే విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు ఉందని డీజీ సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విగ్రహం తలను ఆక్సా బ్లేడ్ (రంపం)తో కోసినట్టు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఘటనాస్థలిలో ఓ రంపం కూడా దొరికిందని చెప్పారు. అంతేకాదు, ఈ ఘటనకు సంబంధించి అనేక ఆధారాలు సేకరించామని వెల్లడించారు.
కేవలం విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేశారని, గుడిలోని ఆభరణాలు, వస్తువులేవీ చోరీకి గురి కాలేదని డీజీ సునీల్ కుమార్ చెప్పారు. దీన్ని బట్టి దేవాలయం గురించి బాగా తెలిసిన వ్యక్తులే ఈ పని చేసేందుకు అవకాశముందని అన్నారు.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడి ఉండొచ్చని సునీల్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని త్వరలోనే దోషులను పట్టుకుంటామని సీఐడీ అడిషనల్ డీజీ సునీల్‌కుమార్ స్పష్టం చేశారు.