మంచి కూతురిలా ఉండలేకపోయా, సారీ..వలంటీర్ ఆత్మహత్య..

By AN TeluguFirst Published Jan 6, 2021, 10:28 AM IST
Highlights

ఉదయం వాకింగ్ కి వెళ్లివచ్చిన ఓ అమ్మాయి నేరుగా గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపతిలో కలకలం రేపింది. ‘నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. కానీ మీ కోసం నేను ఏమీ చేయలేక పోయాను, మిమ్మల్ని ఎప్పుడూ సంతోష పెట్టలేక పోయాను. ఓ మంచి కూతురులా ఉండలేక పోయాను. సారీ అమ్మా, నాన్న’అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టింది. 

వివరాల్లోకి వెడితే.. తిరుపతి నగరంలోని రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన గంగమ్మ, గంగాధర్‌ కుమార్తె దేశమ్మ (21) వలంటీర్‌గా పని చేస్తోంది. గ్రూప్స్‌ రాసేందుకు సిద్ధమవుతోంది. రోజూలాగే మంగళవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటి వచ్చింది. 

రాగానే తలుపులు వేసుకుని ఇంట్లో ఉన్న దూలానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వారు రోజూ లాగే చదువుకుంటోందని భావించారు. ఎంత సేపటికీ తలుపు తెరవకపోవడంతో బలవంతంగా తలుపులు తెరవగా దూలానికి వేలాడుతూ కనిపించింది. 

చేతిలో సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టుకుంది. ‘నా కోసం మీరు ఎంతో కష్టపడ్డారు. కానీ మీ కోసం నేను ఏమీ చేయలేక పోయాను, మిమ్మల్ని ఎప్పుడూ సంతోష పెట్టలేక పోయాను. ఓ మంచి కూతురిలా ఉండలేక పోయాను. నన్ను క్షమించండి. నా చావుకు ఎవరూ కారణం కాదు’అని రాసి ఉంది. 
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌ కోసం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

click me!