రూ. 3వేలకు పెరిగిన పెన్షన్ :లబ్దిదారులకు పంపిణీని చేసిన జగన్

By narsimha lodeFirst Published Jan 3, 2024, 5:47 PM IST
Highlights

వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచింది  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల నుండి పెంచిన పెన్షన్ ను  ప్రభుత్వం లబ్దిదారులకు అందిస్తుంది. 

కాకినాడ: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు  ప్రతి ఏటా  పెన్షన్ ను పెంచుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి.వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచారు.  పెంచిన పెన్షన్ ను  66.34 లక్షల మంది లబ్దిదారులకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  బుధవారం నాడు విడుదల చేశారు.  ఈ సందర్భంగా కాకినాడలో  నిర్వహించిన సభలో  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రసంగించారు.తమ ప్రభుత్వం పెన్షన్ల కోసం  రూ. 1968 కోట్లను ఖర్చు చేస్తుందని  జగన్ చెప్పారు. తెలుగు దేశం ప్రభుత్వం ఖర్చు చేసిన  నిధుల కంటే  ఐదు రెట్లు ఎక్కువ అని  జగన్ వివరించారు.

నెలవారీ పెన్షన్లు అందిస్తున్న  లబ్దిదారుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  66.34 లక్షల మంది. భారత దేశంలో ఇంత పెద్ద మొత్తంలో  పెన్షన్ పొందే లబ్దిదారులు లేరు. రూ. 2 వేల నుండి రూ. 3 వేలకు పెన్షన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడతల వారీగా పెంచింది. ప్రతి ఏటా రూ. 250లను  వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిధులను పెన్షన్ ను పెంచింది.2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి  పెన్షన్ ను రూ. 250 పెంచుతూ  వచ్చింది జగన్ ప్రభుత్వం.

కొత్త సంవత్సరంలో పేదల జీవితాల్లో వెలుగులు రావాలని తాను కోరుకుంటున్నట్టుగా  ఏపీ సీఎం వై.ఎస్. జగన్ చెప్పారు.అర్హులైన వారందరికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ప్రతి నెల రూ 3000లను అందించనున్నామని  సీఎం వివరించారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద గత నాలుగేళ్లలో లబ్దిదారుల సంఖ్య కూడ రెట్టింపు అయిందని ఆయన గుర్తు చేశారు.

2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు పెన్షన్ ను  రూ. వెయ్యి రూపాయాలను  39 లక్షల మంది లబ్దిదారులకు ఇచ్చేవారన్నారు. ఆనాడు చంద్రబాబు సర్కార్ రూ. 400 కోట్లు కేటాయించిన విషయాన్ని  జగన్ గుర్తు చేశారు. తమ ప్రభుత్వం  రూ. 2 వేల కోట్లను  ప్రతి నెలా పెన్షన్ కోసం ఖర్చు చేస్తుందని  ఆయన  వివరించారు.చంద్రబాబు పాలనకు తమ పాలనకు మధ్య వ్యత్యాసం ఇదేనని  ఆమె చెప్పారు.

తెలుగు దేశం పార్టీ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో ఒక్కో లబ్దిదారుడికి రూ. 58,400 అందించిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు.2019 నుండి ఒక్కో లబ్దిదారుడికి తమ ప్రభుత్వం రూ. 1.47 లక్షలను అందించినట్టుగా జగన్ వివరించారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో పెన్షన్ లబ్దిదారుల సంఖ్య రెట్టింపైందని ప్రభుత్వం తెలిపింది.

గ్రామ, వార్డు వ్యవస్థల ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ అందిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కోసం  లంచాలు కూడ ఇవ్వాల్సిన పరిస్థితులు ఉండేవని జగన్ విమర్శలు చేశారు.

also read:కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేస్తారు: కాకినాడ సభలో వై.ఎస్. జగన్ సంచలనం

వ్యక్తులు, పార్టీలు, ప్రాంతాలతో సంబంధాలు లేకుండా  పెన్షన్ అందిస్తున్న విషయాన్ని  జగన్ గుర్తు చేశారు. జగనన్న గృహ నిర్మాణ పథకం కింద పేదలకు ఇళ్ల కేటాయింపుపై ప్రధాని మోదీకి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లేఖ రాయడంపై సీఎం జగన్‌ తీవ్రంగా స్పందించారు. ఈ పథకంలో అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో పేదలకు మూడు సెంట్ల భూమిని ఇస్తానని చెప్పి ఇవ్వలేదన్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతిపై  పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు.

తన విశ్వసనీయతను గురించి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడాన్ని  సీఎం జగన్ తప్పు బట్టారు.పేద ప్రజలకు తమ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే తెలుగు దేశం, జనసేన ఉద్దేశ్యమని జగన్ విమర్శించారు.

click me!